మిల్కీ బ్యూటీ తమన్నా వరుసగా సినిమాలు చేస్తోంది కానీ.. ఈ అమ్మడికి సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు. కెరీర్ కీలక దశలో ఉండగా బాహుబలిలో అవంతిక రోల్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన తమన్నా కెరీర్ కి.. ఆ తర్వాత ఊపిరి చిత్రంతో మరింత ఊపిరి లభించింది. అయితే.. ఆ తర్వాత మళ్లీ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. మరే ఇతర భారీ ఆఫర్స్ రాలేదు.
హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అభినేత్రి.. విశాల్ తో చేసిన కత్తి సాందాయ్(తెలుగులో ఒక్కడొచ్చాడు) చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు బాహుబలి రెండో భాగంపై ఆశలు పెట్టుకుంది తమన్నా. 'బాహుబలి2 విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ రెండో భాగంతో నాకు మరింత మంచి పేరు వస్తుంది. నా పాత్రపై ఆడియన్స్ రియాక్షన్ కోసం ఆసక్తిగా చూస్తున్నా' అని చెప్పింది తమన్నా. ఇటు సినిమాల గురించి చెబుతూనే అటు ఫ్యాషన్ పై ఉపదేశాలు కూడా ఇస్తోంది.
గతంలో ఫ్యాషన్ ను పట్టించుకోకపోయినా.. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నానని చెప్పిన మిల్కీ.. ముంబైలో సమ్మర్ లో చెమట పడుతుందని.. అందుకే కాటన్ దుస్తులు వేసుకోవాలని ఓ సలహా ఇచ్చింది. అయితే.. విపరీతంగా నచ్చితే మాత్రం ఎలాంటి ఫ్యాషన్ డ్రెసింగ్ అయినా వేసేసుకోవచ్చట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/