ఫోటో స్టొరీ: ప్లాస్టిక్ షర్టు.. స్టన్నింగ్ పోజు

Update: 2019-07-09 04:12 GMT
చిక్కటి పాల రంగులో ఉండడంతో తమన్నాను మిల్కీ బ్యూటీ అనే బిరుదు తో సత్కరించుకున్నారు దక్షిణాది ప్రేక్షకులు.  ఒక దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నా సౌత్ లో దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించింది.  తమన్నా ఫేడ్ అవుట్ అయిందని వార్తలు రావడం.. అంతలోపు ఒక భారీ హిట్ తగలడం తమన్నాకు వెరీ వెరీ కామన్.  'ఎఫ్ 2' కు ముందు తమన్నా ఫ్లాపుల సంగతి అందరికీ తెలిసిందే. అయితే 'ఎఫ్ 2' తో ఒక్కసారిగా మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. 

ఈ సినిమాల సంగతి ఇలా ఉంటే తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అప్పుడప్పుడూ మ్యాగజైన్ల కవర్ పేజిలపై కూడా తళుక్కున మెరుస్తూ ఉంటుంది.  తాజాగా 'ఎఫ్ హెచ్ ఎం' మ్యాగజైన్ కోసం ఒక కత్తి లాంటి ఫోటో షూట్ చేసింది.  ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతా ద్వారా పంచుకుంది.  ఈ కవర్ పేజిలో తమన్నా బ్లాక్ అండ్ వైట్ గళ్ళు ఉండే ఒక మినీ షార్ట్ ధరించింది.. పైనేమో ఇన్నర్ కనిపించేలా ఒక ఆకుపచ్చ రంగు ప్లాస్టిక్ షర్టు వేసుకుంది. కూర్చున్న పోజు.. హెయిర్ స్టైల్.. అదరహో.   అందాల ఆరబోతకు ఏమాత్రం ఆటంకం లేకుండా చూసుకుంది.  ఈ కవర్ పేజి పై 'తమన్నా చిక్ పవర్ హౌస్' అనే ఒక క్యాప్షన్ కూడా ఉంది.  అంటే ఈ టైటిల్ తో మ్యాగజైన్లో ఒక కవర్ స్టొరీని ప్రచురించినట్టుగా ఉన్నారు.  ఎఫ్ హెచ్ ఎం జులై ఎడిషన్ ఇది.

ఈ ఫోటోకు కామెంట్లు సూపర్ గా పెట్టారు నెటిజన్లు. "యూ నాటీ మిల్కీ బ్యూటీ".. "రెయిన్ కోట్ డిజైన్ డ్రెస్".. "తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్".."ప్లాస్టిక్ షర్టు.. స్టన్నింగ్ పోజు" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక తమన్నా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో 'సైరా'.. 'దట్ ఈజ్ మహాలక్ష్మి'.. తమిళంలో విశాల్-సుందర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో.  నటిస్తోంది. 'ఆనందో బ్రహ్మ' తమిళ రీమేక్ లో కూడా నటిస్తోంది.


Tags:    

Similar News