ఎన్టీఆర్ అండ్ బన్నీ ఏమైపోవాలి?

Update: 2018-01-23 02:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా చెదరని అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. మధ్యలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది. అయితే సౌత్ లో మిల్కీ అందంతోనే కాకుండా డ్యాన్స్ లో కూడా ఇరగదీస్తుందని అందరికి తెలిసిన విషయమే. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో అమ్మడు చిందులేసింది. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో నా నువ్వే అనే సినిమా చేస్తోంది.

రొమాంటికల్ కామెడీ తరహాలో తెరకెక్కుతోన్న ఆ సినిమాలో డ్యాన్స్ స్పెషల్ అని తెలుస్తోంది. ప్రధాన పాత్ర దారుల స్టెప్పులు అందరిని మైమరపిస్తాయి అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే తమన్నా కూడా సోషల్ మీడియాలో ఆ విషయాన్ని చెప్పింది. అయితే సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పై మాత్రం అమ్మడు పొగడ్తలతో ముంచేసింది. అంతని కలసి ట్యాంగో చేస్తున్నందున.. అతనే బెస్ట్ డ్యాన్సర్.. బెస్ట్ డ్యాన్స్ పార్టనర్.. అంటూ సెర్టిఫికెట్ ఇచ్చేసింది. అయితే ఇంతకుముందు ఈ బ్యూటీ చాలా మంది యువ హీరోలతో నటించింది. కానీ ఎప్పుడు ఈ స్థాయిలో ఏ హీరోని పొగడలేదు. అక్కడే ఇప్పుడు తంటా వస్తోంది.

ముఖ్యంగా టాలీవుడ్ లో బన్నీ అండ్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తమన్నా వారి స్పీడ్ గురించి తెలిసి కూడా కళ్యాణ్ రామ్ అందరికంటే బెస్ట్ డ్యాన్సర్ అనే లెవెల్లో పొగడటం నిజంగా ఆశ్చర్యమే. మరి ఈ సినిమాలో కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. చూద్దాం తమన్నా మాట ఎంతవరకు నిజమో!!


Tags:    

Similar News