తనపై వచ్చే నెగటివ్ కామెంట్స్ కు పాజిటివ్ గా రియాక్ట్ అవుతానని, నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుకుంటే తప్పకుండా నేను వారికి సరైన సమాధానం చెప్పేందుకు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానంటోంది ముద్దుగుమ్మ తమన్నా. తాజాగా ఈ అమ్మడు తెలుగు, తమిళంలో చిన్నా చితకా చిత్రాలు మాత్రమే చేస్తూ ఉంది. అయితే మళ్లీ తన కెరీర్ పుంజుకుంటుందని, అందుకు తాను చాలా కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విడుదలైన తర్వాత మళ్లీ బిజీ అవుతానంటూ చెప్పుకొస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనపై వస్తున్న గాసిప్స్ మరియు ట్రోల్స్ ట్వీట్స్ పై స్పందిస్తూ వింత వ్యాఖ్యలు చేసింది. తమన్నా పనైపోయింది, ఆమె కెరీర్ ఖతం అంటూ కొన్ని ట్వీట్స్ చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది. అలాంటి ట్వీట్స్ నాలో ఉత్సాహంను పెంచుతాయి. ఆ ట్వీట్స్ ను గాసిప్స్ ను చూసినప్పుడు నాలో కసి మరింతగా పెరుగుతుంది. ఆ కసితో ఉత్సాహంగా సినిమాల్లో నటించడం, మరిన్ని సినిమాలకు కమిట్ అవ్వడం జరుగుతుందని తమన్నా చెప్పుకొచ్చింది.
తనపై జరిగే బ్యాడ్ ప్రచారానికి నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను అని, వాటికి సమాధానం చెప్పేందుకు కూడా ఆసక్తి చూపించను, నా పనితో నా సినిమాలతో వాటికి సరైన సమాధానం చెబుతాను అంటూ తమన్నా ధైర్యంగా చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు తాను ఇండస్ట్రీకి కొత్త అన్నట్లుగా భావించి కష్టపడతాను. తాను ప్రతి సినిమాను కూడా మొదటి సినిమా అన్నంత కసితో చేస్తాను, ప్రతి సినిమాకు కూడా నా పూర్తి ఎఫర్ట్ పెడతాను. అందుకే నేను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు నటనపై ఆసక్తి ఉన్నంత కాలం ఇండస్ట్రీలో ఉంటాను. నాకు నటనపై ఎప్పటికి ఆసక్తి ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఇండస్ట్రీతోనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే తమన్నా హీరోయిన్ గా ఛాన్స్ లు రాకున్నా క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ అయినా ఓకే అన్నట్లుగా చెప్పకనే చెప్పింది.