సెలబ్రెటీలన్నప్పుడు ఎప్పటికప్పుడు పుకార్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో రకాల పుకార్లను మోస్తారు. కొన్ని పుకార్లు వారికి నవ్వు తెప్పించే విధంగా ఉంటే మరి కొన్ని పుకార్లు వారి కెరీర్ పై ప్రభావం చూపించే విధంగా ఉంటాయి. హీరోయిన్స్ పెళ్లి వార్తలకు లెక్కలేనన్ని వస్తాయి. హీరోయిన్ గా ఫేడ్ ఔట్ అవుతున్న సమయంలో పెళ్లికి సిద్దం అవుతుంది అంటూ ప్రచారం మొదలవుతుంది. తమన్నా విషయంలో కూడా చాలా పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన పెళ్లి వార్తలపై స్పందించింది. గతంలోనే పుకార్లను కొట్టి పారేసిన తమన్నా మరోసారి ఆ వార్తల్లో కనీసం 1% కూడా నిజం లేదని తేల్చి చెప్పింది. తన పెళ్లి గురించి మీడియాలో వచ్చిన పుకార్లన్నింటిని తీసుకుని ఒక కథగా మల్చితే సినిమాగా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్లుగా కౌంటర్ ఇచ్చింది. తన పెళ్లి గురించి ప్రచారం చేస్తున్న వారికి ఈ సమాధానంతో స్వీట్ షాక్ ఇచ్చినట్లయ్యింది.
ఆమద్య కెరీర్ పరంగా కాస్త డల్ అయినట్లుగా అనిపించినా మళ్లీ ఈమె పుంజుకుంటుంది. తెలుగులో సైరా చిత్రంలో నటించడంతో పాటు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తోంది. మరో వైపు హిందీలో కూడా ఈమెకు ఆఫర్ వచ్చింది. మూడు భాషల్లో కలిపి మళ్లీ ఈమె బిజీ అయ్యింది. మరో అయిదు సంవత్సరాల పాటు తమన్నా హీరోయిన్ గా కొనసాగాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందట. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తుందేమో చూడాలి.