బాహుబలి తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మిల్కీబ్యూటీకి ఛాన్స్‌

Update: 2020-08-31 11:10 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ దాదాపుగా ఖతం అయ్యిందని అనుకుంటున్న సమయంలో ఆమెను అనూహ్యంగా సూపర్‌ స్టార్‌ మూవీలో ఛాన్స్‌ వచ్చింది. దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత తమన్నాకు స్టార్‌ హీరోతో కలిసి నటించే అవకాశం వచ్చింది. బాహుబలి మొదటి ప్టార్‌ లో నటించిన తర్వాత బిగ్గర్‌ స్టార్‌ సినిమాల్లో మాత్రం ఈమెకు ఆఫర్లు రాలేదు. మద్యలో ఎఫ్‌2 సినిమాలో వెంకీకి జోడీగా నటించినా ఆమె అభిమానులకు అది పూర్తి స్థాయి సంతృప్తిని అయితే ఇవ్వలేదు. ఆ సినిమా క్రెడిట్‌ పెద్దగా ఆమెకు దక్కక పోవడం వల్ల తమన్నా మెల్లగా ఫేడ్‌ ఔట్‌ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

ఇలాంటి సమయంలో ఈమెకు తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ కి జోడీగా నటించే అవకాశం దక్కించుకుంది. గత అయిదు సంవత్సరాలుగా చిన్న హీరోలతో కెరీర్‌ ను నెట్టుకు వస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు ఈసారి పెద్ద స్టార్‌ తో ఛాన్స్‌ రావడంతో ఖచ్చితంగా మరోసారి ఈమె ఇతర స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ అవుతుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కెరీర్‌ ఎండ్‌ అవుతుంది అనుకుంటున్న సమయంలో విజయ్‌ తో సినిమా ఛాన్స్‌ రావడంతో మళ్లీ ఈమె కెరీర్‌ కు జీవం వచ్చనట్లయ్యింది.

మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందబోతున్న సినిమాలో తమన్నా ఎంపిక అయ్యింది. ఇప్పటి వరకు ఆ విషయం గురించి అధికారికంగా ప్రకటన రాకున్నా కూడా ఇది నిజమే అన్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కరోనా కారణంగా మాస్టర్‌ విడుదల ఆగిపోవడంతో విజయ్‌ మురుగదాస్‌ సినిమాను వాయిదా వేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఆ సమయంలోమురుగదాస్‌ హీరోయిన్‌ గా తమన్నా నటించబోతుంది అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News