ఈ అమ్మడి ఫిగర్ సీక్రెట్ ఇదేనట!!

Update: 2020-07-23 12:10 GMT
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ భామ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్లో కోలీవుడ్.. టాలీవుడ్.. బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా సక్సెస్ అయింది. అయితే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నది మాత్రం తెలుగు, తమిళంలోనే. మిల్కీ బ్యూటీగా ఫేమస్ అయిన తమన్నా.. నటిగా దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. ఆ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక తమన్నా నటిగా పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. అమ్మడు 2005లో పదిహేనేళ్ల ప్రాయంలో సినీ కెరీర్‌ను ప్రారంభించింది.

బాలీవుడ్ చిత్రం చాంద్ సే రోషనన్ చెహ్రా అనే బాలీవుడ్ చిత్రంతో తెరంగేట్రం చేయగా.. అదే ఏడాది తెలుగులో శ్రీ, తమిళంలో కేడీ(2006) అనే చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ నుండి హార్డ్ వర్క్, నిజాయితీని నమ్ముకున్న తమన్నా తెరపై అలా ఎదుగుతూ అలరిస్తూ వస్తుంది. ఇన్నేళ్లయినా తమన్నా అందం చూస్తే కళ్లు తిప్పుకోలేరు. అయితే తమన్నా ఈ మధ్య సినిమాల్లో సరిగ్గా కనిపించడం లేదని, అవకాశాలు తగ్గాయని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఎలాంటి రూమర్స్ అయినా పెద్దగా పట్టించుకోని తమన్నా..

అవకాశాలు తగ్గాయి అనే రూమర్ పై స్పందించి.. ఎవరన్నారు నాకు అవకాశాలు లేవని? ప్రస్తుతం తన చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయని చెప్పింది. కానీ తెలుగులో చేయడానికే ఎక్కువగా ఇంటరెస్ట్ అన్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే తమన్నా.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో వ్యాయామం చేస్తున్న పిక్స్ షేర్ చేసింది. ఆ ఫోటోలలో తమన్నాను చూస్తూ నెటిజన్లు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అమ్మడి అందానికి ఇదేనా సీక్రెట్ అనుకుంటున్నారు. తమన్నా ఎల్లప్పుడూ తన ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తుందట. అందుకే అందమైన ఒంపు సొంపులతో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ అయింది. ప్రస్తుతం తమన్నా సీటిమార్ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తుంది.
Tags:    

Similar News