మిల్కీ బ్యూటీ తమన్నా టాప్ స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే గడచిన రెండు మూడు సంవత్సరాలుగా ఆమెకు స్టార్ హీరోలకు జోడీగా కమర్షియల్ హీరోయిన్ పాత్రలు తగ్గాయి. వచ్చిన ఆఫర్లతో కెరీర్ ను నెట్టుకు వస్తూ అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ ఉన్న తమన్నా త్వరలో 11th అవర్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహా లో స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉన్న ఈ వెబ్ సిరీస్ లో తమన్నా పాత్ర చాలా కొత్తగా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా భారీ మొత్తంను పారితోషికంగా తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 11th అవర్ వెబ్ సిరీస్ ను షూటింగ్ ను కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేశారట. ఈ వెబ్ సిరీస్ కోసం తమన్నా ఏకంగా రెండు కోట్ల పారితోషికంను అందుకుందంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు వెబ్ సిరీస్ లకు ఆధరణ ఇప్పుడిప్పుడే వస్తోంది. ఇలాంటి సమయంలో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లు రావడం అంటే సాహసమే. వెబ్ సిరీస్ లను తక్కువ బడ్జెట్ తో చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయిన 11th అవర్ వెబ్ సిరీస్ కూడా తక్కువ బడ్జెట్ తోనే రూపొంది ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అలాంటి వెబ్ సిరీస్ కు తమన్నాకు రెండు కోట్ల పారితోషికం ఇవ్వడం అంటే అనుమానమే అన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పుడు తమన్నాకు రెండు కోట్లు పారితోషికం ఇచ్చేంత డిమాండ్ లేదు అనేది మరి కొందరి వాదన.