‘పుష్ప’ అమితాశక్తి కనబర్చుతున్న తమిళ తంబీలు

Update: 2020-04-13 05:10 GMT
అల్లు అర్జున్‌ 20వ చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌ లుక్‌ ఇటీవలే వచ్చిన విషయం తెల్సిందే. సుకుమార్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం.. హిందీ.. కన్నడం.. మలయాళంలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. పాన్‌ ఇండియా లెవల్‌ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగులో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక మలయాళంలో బన్నీకి ఉన్న క్రేజ్‌ కారణంగా అక్కడ పుష్పపై ఆసక్తి నెలకొంది. అయితే తమిళంలో బన్నీ సినిమాలకు పెద్దగా బజ్‌ ఉండదు. కాని పుష్ప చిత్రాన్ని వారు ప్రత్యేకంగా చూస్తున్నారు.

తమిళ ఆడియన్స్‌ ‘పుష్ప’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా నెట్టింట్ల జరుగుతున్న చర్చను చూస్తుంటే అర్థం అవుతుంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌ నల్లమల్ల లో గందపు చెక్కల స్మగ్లర్‌ గా లారీ డ్రైవర్‌ గా కనిపించబోతున్నాడు. తాజాగా వచ్చిన ఫస్ట్‌ లుక్‌ తో సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో తమిళ జనాలకు కొన్ని సంవత్సరాల క్రితం నల్లమల్ల అడవుల్లో జరిగిన ఎన్‌ కౌంటర్‌ గుర్తుకు వస్తుందట.

గందపు చెక్కల స్మగ్లర్స్‌ అంటూ పెద్ద తలకాయలను వదిలేసి దాదాపు 20 మంది డైలీ లేబర్స్‌ ను అటవి శాఖ అధికారులు ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఆ ఎన్‌ కౌంటర్‌ బూటకం అంటూ పలువురు ఆరోపించారు. ఇంకా కూడా ఆవిషయమై తమిళ జనాల్లో ఏపీ అటవి శాఖ అధికారులపై ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు పుష్ప అలాంటి నేపథ్యంలో తెరకెక్కుతున్న కారణంగా వారు ఈ సినిమాలో ఆ ఎన్‌ కౌంటర్‌ గురించి ఏమైనా ప్రస్థావిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News