దళపతి 67 పై సాలీడ్ అప్డేట్ ఇచ్చిన తమిళ దర్శకుడు..!

Update: 2022-10-27 05:30 GMT
తమిళ స్టార్ హీరో విజయ్ జోసఫ్ తదుపరి సినిమాపై ఓ సాలీడ్ అప్డేట్ బయటికొచ్చింది. 'బీస్ట్ ' మూవీ తర్వాత విజయ్ దళపతి 66వ సినిమాగా వరిసు (Varisu)' మూవీ రాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు 'వరిసు' మూవీని నిర్మిస్తున్నాడు. దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది.

తమిళంలో తెరకెక్కుతున్న 'వరిసు' మూవీని తెలుగులో 'వారసుడు'గా తీసుకురాబోతున్నారు. దీపావళి సందర్భంగా 'వరిసు' సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది. ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసి 2023 సంక్రాంతికి సినిమా రాబోతుందని ప్రకటించారు.

'వారసుడు' మూవీ సెట్స్ పై ఉండగానే విజయ్ తదుపరి సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ వచ్చింది. విజయ్ దళపతి 67వ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ తెరకెక్కించనున్నారు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన లోకేష్ విజయ్ సినిమాను సైతం ఫుల్ లెన్త్ యాక్షన్లో తీసుకు రాబోతున్నాడు.

లోకేష్ కనకరాజ్ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ దళపతి 67 మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయాన్ని వెల్లడించారు. దళపతి 67 సినిమాను 2022 డిసెంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రాబోతుందనే హింట్ ను దర్శకుడు కనక రాజ్ ఇచ్చారు.

విజయ్ దళపతి.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తాజాగా మరోసారి వీరి కాంబినేషన్ సెట్ కావడంతో ఈ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

మరోవైపు ఈ మూవీలో నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ రానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News