సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కి చిరంజీవి..మ‌హేష్‌..ప్ర‌భాస్ వెళ్లాలా?

Update: 2022-02-13 06:30 GMT
ఇటీవ‌లే ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో...చిరంజీవి..మ‌హేష్‌..ప్ర‌భాస్..రాజ‌మౌళి..కొరాటాల శివ త‌దిత‌రులు ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో చిరంజీవి టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలో ఆయ‌న  మాట్లాడిన తీరు యాచించిన‌ట్లుగా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో  కొంత మంది  వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌గా..మ‌రికొంత మంది ప‌రిశ్ర‌మ బాగు కోసం చిరంజీవి ఓ మెట్టు దిగి  త‌గ్గి మాట్లాడ‌టం ఆయ‌న వ్య‌క్తిత్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌శంసించారు.

తాజాగా ఈ విష‌యంపై ద‌ర్శ‌క‌..నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజా త‌న అబిప్రాయాన్ని సైతం వెల్ల‌డించారు.

``ప్ర‌తీ ఒక్క‌రికి ఆత్మ గౌర‌వం ఉంటుంది. దాన్ని ప‌క్క‌న‌బెట్టి చిరంజీవి అలా మాట్లాడ‌టం బాధ‌గా ఉంది. చిరంజీవి అడిగిన విధానం యాచించిన‌ట్లుగా ఉంది. ప‌రిశ్ర‌మ ఈ స్థాయిలో ఉందా?  ఈ భేటీలో టిక్కెట్ ధ‌ర‌ల విష‌యం త‌ప్ప ఇంత అంశాలేవి చ‌ర్చ‌కు రాలేద‌న్నారు. అలా కాకుండా ఇత‌ర విష‌యాలు కూడా ప్ర‌స్తావించి ఉంటే అంతా స‌తోషించేవాళ్లం అని త‌మ్మారెడ్డి అన్నారు.

టిక్కెట్ ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్న స‌మ‌యంలో  `అఖండ‌`..`పుష్ప` చిత్రాలు మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. ఒక‌వేళ ధ‌ర‌లు పెరిగితే 20-25 కోట్లు అద‌నంగా వ‌చ్చేది. అంత‌ మాత్రానికి చిరంజీవి..మ‌హేష్‌..ప్ర‌భాస్..రాజ‌మౌళి వెళ్లి అడ‌గాలా? అని త‌మ్మారెడ్డి  ప్ర‌శ్నించారు.

అలాంటి అవ‌స‌రం మ‌న‌కు లేద‌న్నారు. ఇండ‌స్ర్టీని శాషించే వాళ్లం కాకపోయినా మ‌న‌మంతా ప‌న్నులు క‌డుతున్నాం. మ‌న గౌర‌వాన్ని మ‌న‌మే నిల‌బెట్టుకోవాలి. అణ‌గారిగిపోయిన వ‌ర్గంలా ఉండాల్సిన  ప‌నిలేదని`` త‌మ్మారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీ ప్ర‌భుత్వంతో జ‌రిగిన ఏ భేటీకి త‌మ్మారెడ్డి హాజ‌రు కాలేదు.  అభిప్రాయాల్ని త‌న యూ ట్యూబ్ ఛాన‌ల్ వేదిక‌గా పంచుకుంటారు. వివాదాస్ప‌ద అంశాల‌పైనా త‌మ్మారెడ్డి త‌న‌దైన శైలిలో స్పందించి త‌న ప్రత్యేక‌త‌ను చాటుకుంటారు.

అలాగే ఇండ‌స్ర్టీ పెద్ద‌గా చిరంజీవి త‌మ్మారెడ్డి అంగీక‌రించారు.  ``చిరంజీవి పెద్ద మ‌నిషి. అదే హోదాలో సీఎం వ‌ద్ద‌కు వెళ్లారని`` అన్నారు. ఇండ‌స్ర్టీ పెద్ద ఎవ‌రు? అన్న చ‌ర్చ హాట్ టాపిక్ గా న‌లుగుతోన్న స‌మ‌యంలో త‌మ్మారెడ్డి కామెంట్ల‌కు ప్రాముఖ్య‌త చాటుకుంది. అటు చిరంజీవి మాత్రం ఇండ‌స్ర్టీ పెద్ద‌గా కాదు..ప‌రిశ్ర‌మ బిడ్డ‌గా స్పందించాన‌ని ఆయ‌న చెబుతున్న సంగ‌తి తెలిసిందే. 
Tags:    

Similar News