సినిమా టికెట్ రేట్ల ఇష్యూ చాలా చిన్నదట!

Update: 2022-02-09 16:41 GMT
సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన చేసే కామెంట్లు చిచ్చు రేపుతుంటాయి. చిరంజీవి నుంచి మొదలుకొని.. కుర్ర హీరోల వరకూ ప్రభుత్వాలను వదలకుండా విమర్శలు చేస్తుంటారు. తాజాగా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తమ్మారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

అసలు సినిమా టికెట్ల రేట్లు విషయం చాలా చిన్నదని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయన్నారు. సినిమా పరిధి పెరిగిందని.. ఇంతకుముందు టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మామని.. ట్యాక్సులు కట్టలేదని.. ఇప్పుడు రేట్లు తగ్గించడంతో రెవెన్యూ రావడం లేదన్నారు. అందుకే ఇప్పుడు ట్యాక్స్ కడుతామని అంటున్నారని తమ్మారెడ్డి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. రీజనబుల్ రేట్లు ఫిక్స్ చేయమంటున్నామన్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేటు పెంచాలని కోరడం కరెక్ట్ కాదని తమ్మారెడ్డి అన్నారు.

చిత్ర నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయాయని.. వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక చోట టికెట్ రేటు తగ్గితే సమస్య కాదని అభిప్రాయపడ్డారు. ఎవరు మాట్లాడినా పరిశ్రమ మొత్తం కోసం మాట్లాడాలని గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా గుర్తింపు ఉన్న సంస్థలతో చర్చలు జరపాలని సూచించారు.

చిరంజీవితో కూడా చర్చలు చేయండని.. వ్యక్తిగతంగా చర్చలు కరెక్ట్ కాదని తమ్మారెడ్డి హితబోధ చేశారు. చాంబర్ ప్రతినిధులను కూడా పిలవండి అంటూ ఏపీ ప్రభుత్వానికి తమ్మారెడ్డి కీలక సూచనలు చేశారు.

థియేటర్లలో చెకింగులు మొదలుపెట్టారని.. ఎక్కువ రేట్లు అమ్ముకోవడానికి వీలు కావడం లేదని స్పష్టం చేశారు. ఎవరు మాట్లాడినా పరిశ్రమ కోసం మాట్లాడండని తెలిపారు. గుర్తింపు ఉన్న సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రెండు ప్రభుత్వాలకు చాలాసార్లు చెప్పానని తమ్మారెడ్డి చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News