'దేశాన్ని తగలెడతాం అంటే.. మనల్ని తగలెడతారు'.. 'లైగర్' పై తమ్మారెడ్డి కామెంట్స్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'లైగర్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో రూపొందిన ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది.
అయితే ఈ సినిమా ఫలితంపై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని.. మన ప్రవర్తనను బట్టే ప్రేక్షకుల రియాక్షన్ ఆధారపడి ఉంటుందనే విధంగా తమ్మారెడ్డి మాట్లాడారు.
''ఊరికే ఎగిరెగిరి పడటం.. దేశాన్ని తగలెడతాం.. ఊరిని తగలెడతాం అంటే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు. ఇలాంటివి మనకెందుకు?. 'నేను చాలా కష్టపడ్డాను.. సినిమా చూడండి బాబూ' అని చెప్తే బాగుంటుంది. అంతేకానీ నువ్వు చిటికెలు వేస్తే.. వాళ్ళు కూడా చిటికెలు వేస్తారు'' అని తమ్మారెడ్డి అన్నారు.
'లైగర్' సినిమా విషయంలో లెక్క ఎక్కడ తప్పిందని భావిస్తున్నారు? అని ప్రశ్నించగా.. "ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నాకు సంబంధం లేదు. నేను అసలు ఆ సినిమా చూడలేదు. చూడాలని అనిపించలేదు'' అని సీనియర్ ఫిలిం మేకర్ చెప్పారు.
''మామూలుగా నేను పూరీ జగన్నాథ్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ 'లైగర్' ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలని అనిపించలేదు" అని తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పుకొచ్చారు.
నెట్టింట ట్రెండ్ అయిన 'బాయ్ కాట్ లైగర్' పైనా తమ్మారెడ్డి స్పందించారు. అది పనీపాట లేనివారు చేసే పని అని.. అలాంటి ట్రెండ్ ను మొదలు పెట్టేవారు నాకు తెలిసినంత వరకూ సినిమాలు కూడా చూడరు. కాబట్టి అలాంటి వారిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని సీనియర్ నిర్మాత అన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి లైక్స్ చూసుకుని మురిసిపోయే బ్రతుకు అయిపోయింది. ఇంతకుముందు ఎలా కడుపు నింపుకోవాలా అని ఆలోచించేవాళ్ళం.. కానీ ఇప్పుడు లైక్స్ గురించి ఆలోచిస్తున్నాం. అవే కడుపు నింపుతున్నాయి. ఆ లైక్స్ కోసం ఇలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారు. సినిమా బాగుంటే వీళ్ళు బాయ్ కాట్ చేయమన్నా చేయరు.. బాగలేకపోతే థియేటర్ కు రమ్మన్నా రారు అని అభిప్రాయ పడ్డారు.
ఇండస్ట్రీలో 5 శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉందని.. మిగిలిన 95 శాతం సినిమాలు పోతున్నాయని తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషించారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ మంచి రోజులు ఉంటూనే ఉన్నాయని.. రెండు నెలల ముందు మూడు సినిమాలు బాగా ఆడితే.. ఈ నెలలో మూడు చిత్రాలు బాగా ఆడాయని ఆయన అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.