సంక్రాంతి సినిమాల సందడి క్రమంగా ఒక కొలిక్కి వస్తోంది. ఇంకో రెండు మూడు రోజుల్లో సెలవులు పూర్తయిపోతాయి కాబట్టి అంతా సద్దుమణుగుతుంది. అయితే విజేత ఎవరా అనే ప్రశ్నకు రకరకాలుగా సమాధానాలు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ గా కమర్షియల్ గా ఎవరైతే లాభాలు ఇస్తారో వాళ్లనే విన్నర్ గా గుర్తిస్తారు కాబట్టి అందరి నోటా సహజంగానే ఎఫ్2 అనే మాటే వినిపిస్తోంది. ఇక ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా చెప్పుకునే పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల గురించిన రివ్యూలు వీడియో రూపంలో విడుదల చేసారు.
అందులో ఎన్టీఆర్ కథానాయకుడు గురించి చెబుతూ ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నప్పటికీ కథగా చెప్పుకునే ఒక సీన్ క్లైమాక్స్ తప్ప మిగిలినదంతా ఫ్యాన్స్ కోసం పెట్టిన పాటల వల్ల అంతగా మెప్పించలేకపోయిందని చెప్పారు. ఇదే వసూళ్లు రాకపోవడానికి కారణమని విశ్లేషించారు. ఆసక్తికరంగా చెప్పాల్సిన కథనాన్ని నీరసంగా నడపడం వల్లే ఆశించిన రేంజ్ లో ఎన్టీఆర్ ఆడటం లేదని తేల్చేసారు. థియేటర్ల కొరత గురించి పోరాడుతూ వచ్చిన రజనీకాంత్ పేటలో అంచనాలు అందుకునే విషయం లేదట. ఎంత పాత రజనీకాంత్ ను చూసినట్టు అనిపించినా కీలకమైన కథ రొటీన్ గా ఉండటంతో మెచ్చే క్యాటగిరీలో పడలేదని చెప్పారు.
ఇక రంగస్థలం తర్వాత ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిన రామ్ చరణ్ నుంచి వినయ విధేయ రామ లాంటి సినిమా అభిమానులు కోరుకోలేదని చెప్పారు. కేవలం యాక్షన్ సన్నివేశాలు తప్ప కథ పెద్దగా లేకపోవడం అభిమానులకే నచ్చకపోతే సినిమా ఎలా ఆడుతుందని ప్రశ్నించారు. దిల్ రాజుకు సంక్రాంతి పల్స్ బాగా తెలుసనీ అందుకే చక్కని కామెడీతో ఎఫ్2 రూపంలో మరోసారి పెద్ద హిట్ కొట్టారని కితాబు ఇచ్చారు. అయితే విన్నర్ ఎవరో ఇంత స్పష్టంగా చెప్పినా చివర్లో మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కొసమెరుపు