టాలీవుడ్ కు సమస్య వచ్చినప్పుడల్లా 'ఇండస్ట్రీ పెద్ద' అనే టాపిక్ మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ మధ్య ‘మా’ ఎన్నికల సమయంలో ఈ అంశం మీద కొన్ని రోజులు డిష్కసన్ జరిగింది. ఎలక్షన్స్ అయిపోయాక అందరూ సైలెంట్ అయ్యారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు గురించి మాట్లాడటంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండనని.. బాధ్యత గల ఒక ఇండస్ట్రీ బిడ్డగా ఉంటానని చిరు అన్నారు.
''పెద్దరికం హోదా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా వ్యవహరించను. ఆ పదవి నాకు వద్దు. కానీ, బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అందరి బాధ్యతా తీసుకుంటా. అందుబాటులో ఉంటా. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ముందుకు వస్తా. దానికి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు, రెండు యూనియన్ల మధ్య వివాదం జరిగితే.. ఆ తగువులు తీర్చాలని నా వద్దకు వస్తే నేను ఆ పంచాయితీ చేయను'' అని చిరంజీవి అన్నారు.
సినీ పరిశ్రమకు పెద్దగా ఉండనంటూ చిరు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ''చిరంజీవి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని పెద్ద దిక్కుగా భావించినప్పటికీ.. గత కొంతకాలంగా జరిగిన పరిస్థితుల రీత్యా ఆయన విసిగిపోయి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు'' అని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.
''సినిమా టికెట్ ధరల విషయంలో చిరంజీవి మాట్లాడటానికి ముందుకు రావడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఎందుకు రావాలి? ఈ విషయంపై ముందు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పందించాలి. ఒకవేళ వాళ్ల వల్ల సమస్య పరిష్కారం కానప్పుడు చిరంజీవి - బాలకృష్ణ లేదా నాగార్జున - మోహన్ బాబు దగ్గరకు వెళ్లి ఏదైనా సాయం కోరాలి'' అని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.
అలానే సినిమా టికెట్ ధరల మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. అది పెద్ద సమస్యే కాదని తమ్మారెడ్డి అన్నారు. ''సినిమా టికెట్ ధరలు తగ్గించడం అనేది సమస్యే కాదు. ప్రజలు అందరికి అందుబాటులో ఉండాలనే ధరలు తగ్గించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. టికెట్ ధరలు తగ్గించడం వల్ల కొంతమంది ప్రజలు ఆనందిస్తున్నారు. ఇక టికెట్ ధరలు తగ్గించడం వల్ల చిన్న సినిమాలకూ ఇబ్బంది ఉండదు. కేవలం పెద్ద సినిమాలకే సమస్య. అలాంటప్పుడు పెద్ద చిత్రాలకు వేరే ధరలు నిర్ణయించమని ప్రభుత్వాన్ని కోరితే సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది కావాలనే ఎవరో ఒకరి మీద బురద జల్లడం కోసమే టికెట్ ధరలపై కామెంట్స్ చేస్తున్నారు'' అని తమ్మారెడ్డి భరద్వాజ వివరించారు.