ఆ బాధ్యతలను చిరంజీవి తీసుకోవాలి

Update: 2017-12-13 06:00 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును ఖ్యాతిని తెచ్చుకున్న దర్శకులు నిర్మాత దాసరి నారాయణ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మరణించినప్పుడు సినిమా పరిశ్రమ ఎంతగా బాధపడిందో అందరికి తెలిసిందే. ఎంతో మంది కళాకారులను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావడమే కాకుండా చిన్న సినిమాలకు ప్రత్యేకంగా సపోర్ట్ చేయాలనీ నిరంతరం కృషి చేస్తుండేవారు. ఇక సినిమా ప్రముఖులను గుర్తు చేసుకోవాలని ఏదైనా కార్యక్రమం జరపాలన్న అయన ముందుండేవారు.  

కానీ దాసరి మరణం తర్వాత అలాంటి కార్యక్రమాలు చాలానే కరువయ్యాయని చెప్పాలి. ఎవరికి వారు బిజీ అయిపోయి సినిమా పరిశ్రమలో కొన్ని మంచి కార్యక్రమాలను మరచిపోతున్నారు. దీంతో ఆ బాధ్యతలను ఎవరైనా తీసుకుంటే బావుంటుందని చాలా మంది సినీ ప్రముఖులులో చాలా సార్లు చెప్పారు. చర్చలు కూడా బాగానే సాగాయి. ఇకపోతే రీసెంట్ గా 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ రోజు ఈ విషయంపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన అభిప్రాయాన్ని చెప్పారు. దాసరి గారు ఎన్నో మంచి కార్యక్రమాలను సినీ ఇండస్ట్రీలో నిర్వహించారు. ఆయనే పెద్ద దిక్కుగా ఉండేవారు. ఇప్పుడు ఆ బాధ్యతలను మెగాస్టార్ అయిన చిరంజీవిగారు తీసుకుంటే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

''చిరంజీవి ఒక మెగాస్టార్. దాసరి తరువాత ఆయనే ఆ రేంజులో ఉన్నారు. కాబ్టటి అదే స్థాయిలో ఆయన సినిమా ఇండస్ర్టీ విషయాలను నెత్తిమీద వేసుకుని చూసుకుంటే బాగుంటుంది. ఆయన చూసుకుంటారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనలోమనకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా.. దాసరి కూడా వాటిని పక్కనపెట్టి ఇండస్ర్టీ కోసం నుంచున్నారు. మరి చిరంజీవిగారు కూడా అలాగే నుంచోవాలి'' అంటూ తమ్మారెడ్డి వెల్లడించారు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఈ విషయంలో చిరంజీవి ఏం చేస్తారో.
Tags:    

Similar News