బాహుబలి తర్వాత స్టార్ హీరోలు పలువురు తాము చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా సినిమాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలు సైతం తమ సినిమాను పాన్ ఇండియా సినిమా అంటూ అక్కడ ఇక్కడ అంటూ దేశ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా సినిమా గా విడుదల అయిన పలు సినిమాలు ఈమద్య కాలంలో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. కొన్ని సినిమాలు తప్ప చాలా వరకు ఉత్తరాదిన కనీసం ఆకట్టుకోలేక పోతున్నాయి. అయినా కూడా స్టార్ హీరోలు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ అక్కడ ఇక్కడ విడుదల చేసి ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు.
తాజాగా పాన్ ఇండియా సినిమాలు... స్టార్ హీరోలపై ప్రముఖ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రథానంగా సినిమాల యొక్క బడ్జెట్ మరియు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఇంకా దర్శకుల రెమ్యూనరేషన్ గురించి వ్యాఖ్యలు చేసి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.
గత కొన్నాళ్లుగా హీరోలు మరియు ఇతర టెక్నీషియన్స్ పారితోషికాల గురించి చర్చ జరుగుతున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు అంటూ వందల కోట్లు ఖర్చు పెట్టడం కంటే సింపుల్ గా మేజర్ వంటి సినిమాలను తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇటీవల విడుదల అయిన మేజర్ సినిమా నిజమైన పాన్ ఇండియా సినిమా. కేవలం పాతిక కోట్లతో ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈమద్య కాలంలో వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమాలకు మేజర్ ఏమాత్రం తీసిపోకుండా ఉంది. తక్కువ బడ్జెట్ తో అలాంటి మంచి పాన్ ఇండియాలు చేయవచ్చు.
ఆ సినిమా ను దృష్టిలో పెట్టుకుని ఎందుకు అంత తక్కువ బడ్జెట్ లో మనం పాన్ ఇండియా సినిమా లు చేయలేక పోతున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవలి.. ఆలోచించాలి. అలాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తే అప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది.. తక్కువ టికెట్ రేట్లు ఉన్నా కూడా లాభాలు వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.