చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలపై వివాదాలు కొత్తేం కాదు. స్క్రిప్టును డ్రమటైజ్ చేయడం కోసం వక్రీకరించడం.. ఉన్నది ఉన్నట్లు చూపించకపోవడంతోనే చిక్కొచ్చి పడుతోంది. ఇటీవల రిలీజైన సైరా-నరసింహారెడ్డి అందుకు పెద్ద ఎగ్జాంపుల్. ఈ సినిమా కథాంశాన్ని చరిత్రను వక్రీకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సైరా తర్వాత ఆ తరహాలోనే హిందీలో మరో హిస్టారికల్ వారియర్ చిత్రం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ హిస్టరీ బేస్ చేసుకుని తెరకెక్కించిన తానాజీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. తానాజీ 3డి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోందన్న టాక్ ఉంది. ఈ సినిమా ప్రచారంలో సైఫ్ బిజీబిజీగా ఉన్నాడు. అంతేకాదు.. ఓ ఇంటర్వ్యూలో అతడు నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు. సైఫ్ అలీఖాన్ మాత్రం స్వదేశం విషయంలో మాట జారి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం అతడి కామెంట్ పై నెటిజనులు అక్షింతలు వేస్తున్నారు. తానాజీలో విలన్ గా నటించిన పటౌడి హీరో సైఫ్ సోషల్ మీడియాలో రాంగ్ రీజన్ తో ట్రెండ్ అవుతున్నాడు.
`కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా` టాపిక్ పై మాట్లాడి సైఫ్ అడ్డంగా బుక్కయ్యాడు. అనుపమ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వూలో సైఫ్ ను ఈ మూవీ సబ్జెక్ట్ లో రాజకీయాలపై మాట్లాడాల్సిందిగా కోరగా.. ``ఫస్ట్ ఇది నేను చరిత్ర అనుకోవడం లేదు. బ్రిటీష్ వారు స్వాతంత్య్రం తిరిగి ఇచ్చే వరకూ ఈ సినిమాలో భారతదేశ ఉనికి ఉన్నట్లు నాకు అనిపించలేదు`` అంటూ నోరు జారాడు. జాతీయతపై సైఫ్ ఇచ్చిన సమాధానం కఠువుగా ఉందని కొందరు నెటిజనులు సీరియస్ గా ఫైర్ అవుతున్నారు.
ఓ నెటి జనుడు భారతదేశపు పురాతన చిత్రపటాన్ని షేర్ చేస్తూ.. చరిత్రను ప్రశ్నించే ముందు మొదట ఇది చదవండి మిస్టర్ అంటూ దునుమాడాడు. మరో నెటిజనుడు డియర్ సైఫ్ బ్రిటీష్ వారు భారతదేశానికి రాక పూర్వం చాలా ఏళ్ల క్రితం గీసిన ఈ భారతదేశపు చిత్ర పటాన్ని చూడండి.. చరిత్ర తెలసుకుని మాట్లాడండి... ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చరిత్రను కొంచెమైనా అర్ధం చేసుకోండి!! అంటూ ఫైర్ అయ్యాడు. ఒక నెటిజన్ అయితే ఈ వివాదంలోకి సైఫ్ వారసుడు థైమూర్ ని లాగాడు. థైమూర్ అన్న పేరుకి మంగోలియన్స్ కి ఉన్న సంబంధంపై చురకలు వేశాడు. అది తెలిస్తే అసలు ఈ పేరునే తన వారసుడికి పెట్టేవాడు కాడని సైఫ్ ని చెడుగుడు ఆడాడు. ఈ తరహాలో సైఫ్ పై నెటిజనులు చెలరేగి విమర్శలు గుప్పిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.