నటుడు - దర్శకుడు - రచయిత - భక్తుడు ఇన్ని విలక్షణాలు ఉన్న ఏకైక పర్సనాలిటీ తనికెళ్ల భరణి. నాటక రచయితగా కెరీర్ ప్రారంభించి - రంగస్థలంపై ఎన్నో నందులు అందుకుని - సాహిత్యాన్ని పుక్కిట పట్టి - శివభక్తుడిగా జీవితాన్ని ధన్యం చేసుకుని - నటనలో అడుగుపెట్టి - అటుపై దర్శకుడిగా మారి ఇలా అతడు చేయనిది లేనేలేదు. ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సనాలిటీల్లో ఆయన ఒకరు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్ ని సాగించిన ఆయన ఇప్పటికీ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయనేం రాస్తాడులే అని వర్మ పక్కనబెట్టినా - ఆయనే దిక్కయ్యాడు నాడు శివ సినిమాకి.
దర్శకరచయిత - నటుడు తనికెళ్ల భరణి వ్యవహారిక శైలి - నిత్య జీవిన శైలి ఏ ఇతర ఆర్టిస్టుతో పోల్చినా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఇప్పటికీ అదే డౌన్ టు ఎర్త్ స్వభావాన్ని విడిచిపెట్టరు. అందరితో కలివిడిగా కలిసిపోతారు. జనవరి 1కి ముందే 31 రాత్రి నలుగురితో కలిసి ఇంట్లో భజనలు చేయడం, పార్టీలు పెట్టుకోవడం ఆయనకు ప్రతియేటా అలవాటు. వెంటనే కలిసిపోయే శివతత్వం ఆయనకు ఉంది. అందరితో కలిసి నేలమీద కూచుని ధ్యానంలో నిమగ్నమవుతారు. అదంతా శివాజ్ఞగా భావిస్తారు ఈ మహాభక్తుడు. తనికెళ్ల గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో సంగతులు యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూల్లో ఉన్నాయి.
ఇదివరకూ మిధునం చిత్రానికి దర్శకత్వం వహించారు భరణి. అది కమర్షియల్ గా డబ్బు తేకపోయినా క్రిటికల్ గా తనకు గొప్ప పేరు తెచ్చింది. అద్భుతమైన కథతో - భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో మిథునం చిత్రాన్ని తెరకెక్కించారు. ఎక్కడో ఉన్న పిల్లల కోసం మలి వయసులో తల్లిదండ్రుల ఎదురుచూపులు చూడాల్సి వస్తే.. వాళ్లు వస్తామంటూ రాకపోతే.. ఆ నరకయాతన ఎలా ఉంటుందో తెరపై గొప్పగా చూపించారు. భార్యా భర్తల మధ్య అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించారు. ఈ సినిమా జ్ఞాపకాల్లోకి వెళ్లిన తనికెళ్ల మాట్లాడుతూ - మిథునంకు ప్రేక్షకుల ఆదరణ లభించడం అదృష్టంగా భావిస్తాను. మళ్లీ అంత మంచి కథతో 2019లో ప్రేక్షకుల ముందుకు వస్తానని నేడు ఓ కార్యక్రమంలో అనడం చూస్తుంటే భరణికి ఇంకా దర్శకుడిగా నెగ్గాలన్న పంతం - పట్టుదల ఉన్నాయని అర్థమవుతోంది. ఇప్పటికి 800 పైగా చిత్రాల్లో నటించాను. వీటిలో ఎక్కువ ప్రతినాయక పాత్రలే చేశానని ఆయన తెలిపారు. పుట్టింది పాలకొల్లుకు సమీపంలోని జగన్నాథపురం గ్రామం. గోదావరి తీరంలోనే పుట్టడం వలన సాహిత్యంపై మమకారం ఉందని - ఇప్పటివరకూ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 650 సినిమాలకు స్క్రిప్టులు రాశానని తెలిపారు. మీరు గ్రేట్ తనికెళ్ల సారూ!