మిమ్మ‌ల్ని నొప్పించాను.. న‌న్ను క్ష‌మించండిః త‌ణికెళ్ల భ‌ర‌ణి

Update: 2021-04-16 11:46 GMT
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర‌వేశారు త‌నికెళ్ల భ‌ర‌ణి. కేవ‌లం న‌టుడు మాత్ర‌మే కాదు.. గొప్ప ర‌చ‌యిత‌, క‌వి కూడా. అయితే.. భ‌గ‌వంతుడిని అమితంగా ఇష్ట‌ప‌డే ఆయ‌న శివుడిని ఎక్కువ‌గా ధ్యానిస్తారు. శంక‌రుడిపై ఇప్ప‌టికే ఎన్నో క‌విత‌లు, ప‌ద్యాలు ర‌చించారు. ఆయ‌న‌ న‌మ్మ‌కాలు ఆయ‌న‌వి కాబ‌ట్టి.. ఎవ‌రికీ ఇబ్బంది లేదు.

అయితే.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్టు హ‌ద్దులు దాటింది. దేవుడంటే విశ్వాసం లేని వారిని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్య‌ల‌తో కూడిన క‌విత రాశారు భ‌ర‌ణి. ఈ క‌విత సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట్ కావ‌డంతో హేతువాదులంతా భ‌ర‌ణిపై మాట‌ల దాడి కొన‌సాగించారు. ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేనితో స‌హా చాలా మంది ఘాటుగా రిప్లే ఇచ్చారు. ఇంత‌కీ ఆయ‌న రాసిన క‌విత ఏమంటే..

''గప్పాల్ గొడ్తరు గాడ్దె కొడుకులు
నువ్వుండగ లేవంటరు
నువ్వున్నవో లేవో చెవుల జెప్పిపోరా
శబ్బాష్ రా శంకరా''

దేవుడిని విశ్వసించని వారిని గాడిద కొడుకులు అంటూ సంబోధించడంతో.. హేతువాదులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. విమ‌ర్శ‌లు తీవ్రం కావ‌డంతో.. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు భ‌ర‌ణి. ఈ మేర‌కు ఓ వీడియో రిలీజ్ చేశారు. త‌న క‌విత కొంద‌రు మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచింద‌ని చెప్పారు. అయితే.. దానికి వివ‌ర‌ణ ఇస్తే క‌వర్‌ చేసుకున్న‌ట్టే ఉంటుంద‌ని, అందువ‌ల్ల అలాంటిది చేయ‌ట్లేద‌ని చెప్పారు. త‌న‌కు హేతువాదుల‌న్నా.. మాన‌వ‌తా వాదుల‌న్నా గౌర‌వం ఉంద‌న్నారు. ఒక మ‌నిషిని నొప్పించే హ‌క్కు మ‌రో వ్య‌క్తికి లేద‌ని, అందువ‌ల్ల తాను నొప్పించిన వారికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని అన్నారు..
Tags:    

Similar News