తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో స్టార్ సెలబ్రెటీగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని గేమ్ ఫైనల్ వరకు వెళ్లిన తనీష్ విన్నర్ కౌశల్ కు గట్టి పోటీ ఇచ్చిన విషయం తెల్సిందే. కౌశల్ కు తప్ప ఇంటి సభ్యులందరికి నచ్చిన వ్యక్తిగా తనీష్ పేరు తెచ్చుకున్నాడు. యాంగ్రీ యంగ్ మన్ గా అందరితో పిలవబడిన తనీష్ బయటకు వచ్చిన తర్వాత కూడా మంచి ఫాలోయింగ్ ను పొందాడు. ఆడవారి పట్ల అతడు చూపే గౌరవం మరియు ఆప్యాయత అతడికి అభిమానులను తెచ్చి పెట్టింది. బాల నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన తనీష్ హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించాడు.
ఒక వైపు నటుడిగా కొనసాగుతూనే మరో వైపు తనీష్ రాజకీయాలపై ఆసక్తి చూపించాడు. తాజాగా తనీష్ ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్దం అయ్యాడు. ఏపీ అభివృద్ది బాటలో నడవాలి అంటే వైకాపా వల్లే సాధ్యం అని భావించిన తనీష్ నేడు జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో జాయిన్ అయ్యాడు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో వైఎస్ జగన్ ను కలిసిన తనీష్ వైకాపాలో జాయిన్ అయ్యాడు. తనీష్ కు పార్టీ కండువ కప్పి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. జగన్ సీఎం అవ్వడం కోసం తాను ఏపీలో ప్రచారం చేస్తానంటూ తనీష్ చెప్పుకొచ్చాడు.