బాలీవుడ్ స్టార్ నటుడు - జాతీయ అవార్డు గ్రహీత నానా పటేకర్ తనను పది సంవత్సరాల క్రితం లైంగికంగా వేదించాడు అంటూ ఇప్పుడు మాజీ హీరోయిన్ తనూశ్రీ దత్తా మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. నానా పటేకర్ వంటి స్టార్ నటుడిపై ఈమె ఆరోపణలు చేసిన నేపథ్యంలో జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకు అంతా కూడా ఈ విషయంపై ఫోకస్ చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా ఈ విషయమై చర్చ జరిగింది.
తనూశ్రీ దత్తాకు పలువురు బాలీవుడ్ స్టార్స్ మద్దతు పలికారు - మరి కొందరు మాత్రం ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మరోసారి మీడియా ముందుకు వచ్చిన తనూశ్రీ దత్తా మాట్లాడుతూ తాను గతంలో నానా పటేకర్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. తనకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పింది. గతంలో తాను ఈ విషయాన్ని ఎందుకు వెళ్లడిచేయలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలిచేవారు ఎవరు లేరు. ఆ సంఘటన గురించి తెలిసిన వారు అంతా కూడా పెదవి విప్పలేదు. అందుకే అప్పుడు నేను మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది.
నేను చేసిన ఆరోపణలకు నానా పటేకర్ నా ముందుకు వచ్చి - కళ్లలోకి చూస్తూ సమాధానం చెప్పగలరా - ఆ దమ్ము ఉందా అంది. నేను ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన ముందు నిల్చుని సమాధానం చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది. నానా పటేకర్ లీగల్ గా తనను ఎదుర్కొనేందుకు సిద్దం అవ్వడం ను కూడా తనూశ్రీ దత్తా చాలా లైట్ తీసుకుంది. ఆయన లీగల్ నోటీసులకు తాను ఇవ్వాల్సిన విధంగా సమాధానం ఇస్తాను అంటూ ప్రకటించింది. నానా పటేకర్ తో పాటు ఇంకా పలువురిపై కూడా ఈమె ఆరోపణలు చేస్తోంది.