బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అయిన నానా పటేకర్ గురించి గత ఏడాది హీరోయిన్ తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపిన విషయం తెల్సిందే. 2008వ సంవత్సరంలో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సమయంలో తనతో నానా పటేకర్ అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ తనూశ్రీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల క్రితం ఈ విషయమై పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేయడ జరిగింది. పోలీసుల ఎంక్వౌరీ జరుగుతున్న ఈ సమయంలో తాజాగా మీడియాలో నానా పటేకర్ కు పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారని తనూశ్రీ దత్తా తాను చేసిన ఆరోపణలను నిరూపించలేక పోయిందని అందుకే పోలీసులు నానా పటేకర్ కేసును క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
నానా పటేకర్ కేసు గురించి మీడియాలో వస్తున్న వార్తలపై తనూశ్రీ దత్తా మండిపడింది. పోలీసులు ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వకుండానే మీడియాలో అలా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన పీఆర్ టీం మీడియాలో ఇలాంటి వార్తలను ప్రసారం చేయిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయనతో వర్క్ చేసేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. అందుకే క్లీన్ చీట్ ఇచ్చారంటూ ప్రచారం చేసుకుని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనూశ్రీ దత్తా ఆరోపించింది.
మీడియాలో వచ్చిన వార్తలపై ఈ కేసును విచారిస్తున్న అధికారిని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విచారణ జరుగుతుంది ఇంతకు మించి మరేం మాట్లాడలేం అంటూ చెప్పుకొచ్చాడు. గత ఏడాది సంచలనం సృష్టించడం మాత్రమే కాకుండా ఇండియాలో మీటూ ఉద్యమం మొదలయ్యేలా చేసిన తనూశ్రీ దత్తా ఈ విషయాన్ని అస్సలు వదిలే ప్రసక్తి లేదంటోంది. రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరిగినా కూడా ఆమె మాత్రం వదలడం లేదు.