హీరోయిన్ తనూశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్ నే కాకుండా దేశాన్నే కుదిపేస్తున్నాయి. నానా పటేకర్ తనను పదేళ్ల క్రితం లైంగికంగా వేదించాడు అంటూ తనూశ్రీ దత్తా ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుండి కూడా ఎంతో మంది ఆమెకు మద్దతుగా నిలుస్తూ - మీటూ అంటూ తాము ఎదుర్కొన్న లైంగిక వేదింపులను చెబుతూ వస్తున్నారు. ఎంతో మంది తనూశ్రీ దత్తాకు మద్దతు పలుకుతుండగా - రాఖీ సావంత్ మాత్రం తనూశ్రీ దత్తాపై విమర్శలు చేసింది.
తనూశ్రీకి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని - ఒకరోజు డ్రగ్స్ తీసుకుని నాలుగు గంటల పాటు వ్యాన్ లోనే పడుకుని ఉండి పోయిందని - ఆ సమయంలో ఆమె చేయాల్సిన పాటను తాను పూర్తి చేసినట్లుగా రాఖీ సావంత్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ పై తనూశ్రీ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పోని ఆరోపణలను తనపై చేసింది అంటూ రాఖీసావంత్ ను కోర్టుకు లాంగింది.
తనూశ్రీ దత్తా ముంబయి కోర్టులో రాఖీ సావంత్ పై 10 కోట్లకు గాను పరువు నష్టం దావా వేసింది. ఈమద్య కాలంలో లైంగిక ఆరోపణలు ఎంత కామన్ అయ్యాయో, పరువు నష్టం దావాలు కూడా అంతే కామన్ అయ్యాయి. ప్రస్తుతం తనూశ్రీ దత్తాపై నటుడు నానా పటేకర్ వేసిన పరువు నష్టం దావా విచారణ జరుగుతూనే ఉన్న విషయం తెల్సిందే. మరో వైపు రాఖీసావంత్ పై తనూశ్రీ దత్తా పరువు నష్టం దావా నమోదు అయ్యింది. మొత్తానికి మీటూ ఉద్యమంతో బాలీవుడ్ అట్టుడికిపోతోంది.