తాప్సీ నోటి వెంట.. చిరు మాట

Update: 2017-02-16 08:35 GMT
ఖైదీ నంబర్ 150 ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఓ పదం ఉపయోగించారు. తాను కానీ తన కుటుంబం కానీ అవతలి వాళ్ల ఆరోపణలకు పెద్దగా స్పందించం కాబట్టి.. సాఫ్ట్ టార్గెట్ గా భావిస్తారనుకుంటా అన్నారు చిరు. ఇప్పుడు తాప్సీ కూడా హీరోయిన్లను.. ముఖ్యంగా తనను దక్షిణాది పరిశ్రమ సాఫ్ట్ టార్గెట్ చేసిందని అంటోంది.

సినిమాల్లో యాక్టింగ్ ట్యాలెంట్ ప్రదర్శించడానికి వస్తే.. గ్లామర్ కే పరిమితం చేశారని గతంలోనే అనింది ఈ ఢిల్లీ బ్యూటీ. ఇప్పుడు సౌత్ లో తాను నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే.. ఐరన్ లెగ్ ముద్ర వేశారని అంటోంది. అసలు సౌత్ సినిమాల్లో హీరోయిన్ కు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఉంటుందో చెప్పాలని.. తను నటించిన మూవీ ఫ్లాప్ అయితే.. అందులో తన భాగం ఎంత ఉంటుందో చెప్పాలని అంది తాప్సీ.

తన ట్యాలెంట్ ను ఇక్కడ గుర్తించకపోయినా.. అదృష్ట వశాత్తూ హిందీ పరిశ్రమలో పింక్ చేసే అవకాశం రావడంతో.. మళ్లీ పుంజుకోగలిగానని చెప్పింది ఈ భామ. ప్రస్తుతం తాప్సీ చేస్తున్న నామ్ షబానా మూవీ.. నేనే షబానా అనే పేరుతో తెలుగులో డబ్ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News