టూకీగా ఏమాత్రం తడుముకోకుండా జవాబులివ్వడంలో తాప్సీ తర్వాతే. కొన్నిసార్లు అనాలోచితంగా మరికొన్నిసార్లు ఎంతో తెలివిగా మీడియా ప్రశ్నలకు జవాబులిచ్చేస్తుంది. ఇక తాప్సీ కి వివాదాలు కూడా కొత్తేమీ కాదు. ఫలానా సౌత్ డైరెక్టర్ నన్ను అలా చేయమన్నాడు! అంటూ అప్పట్లో ప్రముఖ దర్శకుడి గురించి ఇంటర్వ్యూల్లో డేరింగ్ గా మాట్లాడి వివాదానికి తెర తీసింది. ఫలానా హీరో అలాంటివాడు! అని కూడా మాట్లాడే సమర్థత గట్ ఫీలింగ్ తనకు ఉన్నాయని నిరూపించింది. చాలా సందర్భాల్లో స్త్రీలపై వివక్ష గురించి మహిళా నటీమణుల పారితోషికాల విషయంలో మేల్ ఆర్టిస్టులతో పోలిస్తే తారతమ్యాల గురించి నిలదీసే ప్రయత్నం చేసింది.
అయితే ఇలాంటి వివాదాస్పద నటిని కరణ్ ఎందుకని కాఫీ విత్ కరణ్ సీజన్ 7 కి పిలవలేదు? అన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. దొబారా ప్రమోషన్స్ లో తాప్సీ పన్ను తాను కరణ్ షోలో ఎందుకు కనిపించడం లేదో వెల్లడించింది. తాప్సీ పన్ను - అనురాగ్ కశ్యప్ జోడీ `దోబారా` చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు కరణ్ జోహార్ తన చాట్ షోను ప్రమోట్ చేస్తూ ప్రక్కనే ఉన్న గదిలో ఉన్నాడు. దీన్ని గమనించిన మీడియా తాప్సీని కరణ్ షోకి ఎందుకు ఆహ్వానించలేదనే విషయంపై ప్రశ్నించారు. వెంటనే సమాధానమిస్తూ.. ``కాఫీ విత్ కరణ్ కి ఆహ్వానించకపోవడానికి కారణం తన సెక్స్ జీవితం ఆసక్తికరంగా లేదు! అంటూ తాప్సీ ముసిముసిగా నవ్వేసింది. టకా టక్ జవాబులివ్వడంలో తాప్సీ ఎప్పుడూ ముందుంటుంది. మీడియాతో స్పాంటేనియస్ గా జవాబిచ్చేసింది.
`కాఫీ విత్ కరణ్ సీజన్ 7` ఆద్యంతం తారల సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నలు హైలైట్ గా నిలిచాయి. సారా- జాన్వీ- అనన్యలతో పాటు చివరికి కరీనా కపూర్ కూడా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొన్నారు. కరణ్ షో మరీ అదుపు తప్పిపోయిందంటూ సాంప్రదాయవాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దొబారా కాన్సెప్ట్ వైవిధ్యమైనది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఎంతో వైవిధ్యంగా రూపొందిస్తున్న ఈ చిత్రంతో హిట్ కొట్టాలని తాప్సీ ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల ఈ సినిమాకి బోలెడంత పబ్లిసిటీ చేస్తోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ .. ఫాంటాసియా ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాని ప్రదర్శించనున్నారు. ఔటాఫ్ బాక్స్ కాన్సెప్టులతో మెప్పించేందుకు తాప్సీ తనవంతు ప్రయత్నం చేస్తోంది. తదుపరి తన ఔట్ సైడర్స్ నిర్మాణ సంస్థలో కొత్త వారికి అవకాశాలను కల్పించనుంది.
ఔట్ సైడర్స్ కోసం బిగ్ ప్లాన్
గట్సీ కంటెంట్ తో బాలీవుడ్ లోకి దూసుకెళ్లిన మోడ్రన్ గాళ్ గా తాప్సీ బాలీవుడ్ లో ఒక ఔట్ సైడర్ అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి నటవారసత్వం లేకుండా పరిశ్రమలో ఎదుగుతోంది. నామ్ షబానా- రష్మా రాకెట్- బద్లా లాంటి చిత్రాలతో నటిగా తనలోని యూనిక్ నెస్ ని చాటుకుంది. ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటేందుకు బిగ్ ప్లాన్స్ తో ముందుకు సాగుతోంది. గత కొంతకాలంగా తాప్సీ పన్ను సొంత నిర్మాణ సంస్థ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సమంత లాంటి అగ్ర కథానాయికతో హిందీలో వరుస చిత్రాలు నిర్మించేందుకు తాప్సీ సన్నాహకాల్లో ఉందని కూడా కథనాలొచ్చాయి. ఇంతలోనే తాప్సీ నుంచి అద్భుతమైన ప్రకటన ఒకటి వచ్చింది.
`ఔట్ సైడర్స్ ఫిల్మ్స్` పేరుతో ఒక సంస్థను స్థాపించిన తాప్సీ పన్ను ఈ సంస్థలో ఇండస్ట్రీ వెలుపలి నుంచి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని చెబుతోంది. ప్రంజల్ అనే సీనియర్ నిర్మాత తాప్సీకి అండగా నిలిచారు. నిజానికి బాలీవుడ్ మాఫియా ఔట్ సైడర్స్ ని ఎదుగనివ్వకుండా ఆపేస్తోందన్న ప్రచారం ఉంది. ఇక ఇన్ సైడర్ గా పేరున్న అనురాగ్ బసు వంటి ప్రముఖ దర్శకుడితో ఎంతో సన్నిహితంగా మెలిగే తాప్సీ ఇలా ఔట్ సైడర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు ఒక ఆర్గనైజేషన్ ని ఫిట్ చేయడం ఆశ్చర్యపరిచేదే. దాదాపు 20 సంవత్సరాలుగా కంటెంట్ సృష్టికర్త .. నిర్మాత అయిన ప్రాంజల్ ఖండియా తనకు సలహాదారు.
అతను సూపర్ 30 ... 83.. సూర్మ... పికు.. ముబారకన్.. అజర్ వంటి ప్రఖ్యాత చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్న అనుభవజ్ఞుడు. తాప్సీ పన్ను నటించిన రష్మీ రాకెట్ ను కూడా నిర్మిస్తున్నాడు. పురోగతి కోసం చూస్తున్న నాలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాను అని కూడా తాప్సీ తెలిపింది. ప్రాంజల్ - నేను కలిసి కెమెరా ముందు ..కెమెరా వెనుక కొత్త తారల్లో ప్రతిభావంతుల కోసం తలుపులు తెరిచామని తెలిపారు.