బయోపిక్ సినిమాలు ఈ రోజుల్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా క్రీడాకారులకు సంబంధించిన కథలను వెండితెరపై పైకి తీసుకొస్తే మాత్రం మొన్నటి వరకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలోనే విజయాన్ని అందుకున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం కొన్ని క్రికెట్ బయోపిక్స్ అంతగా సక్సెస్ కావడం లేదు. ఇక రీసెంట్ గా వచ్చిన మిథాలీ రాజ్ బయోపిక్ శభాష్ మిథు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.
ఈ సినిమాలో మిథాలి రాజ్ పాత్రలో బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం తాప్సి పడిన కష్టం అంతా ఇంత కాదు. క్రికెట్ కోచింగ్ కోసమే దాదాపు 6 నెలలు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. అంతేకాకుండా ఆమె మిథాలి రాజ్ తో కలిసి కొన్ని నెలలపాటు తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల్లో అవగాహన కూడా చేసుకుంది.
ఎలాంటి పరిస్థితుల్లో ఆమె ఏ విధంగా ప్రవర్తించేది అనే అన్ని రకాల అంశాలను కూడా అవపోసన చేసుకుంది. అయితే అవి కూడా వెండితెరపై మాత్రం వర్కౌట్ కాలేదు. ఆడియన్స్ ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. మొదటి రోజే ఊహించిన విధంగా థియేటర్స్ అన్నీ కూడా ఖాళీగానే కనిపించాయి. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోవడం సినిమాకు మొదటి నుంచి పెద్దగా బజ్ లేదు.
ప్రమోషన్లు కూడా నీరసంగా ఉన్నాయి. కేవలం తాప్సి మాత్రమే కాస్త హడావిడి చేసినప్పటికీ కూడా మార్కెట్లో పెద్దగా ఆ ప్రభావం చూపించలేకపోయింది. గతంలో కేవలం మహేంద్రసింగ్ ధోని బయోపిక్స్ మాత్రమే పెట్టిన పెట్టుబడికి కొంత లాభాలను ఇచ్చింది. ఆ తర్వాత ఆజర్, 83 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగానే నిరాశపరిచాయి. ఇక శభాష్ మీతు సినిమాలో ఎమోషనల్ కంటెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉంది అనే కామెంట్స్ కూడా ఎక్కువ వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా బయోపిక్స్ ప్రస్తుతం గడ్డు కాలమే ఎదుర్కొంటున్నాయి. కంటెంట్ బలంగా లేకపోతే ఆడియెన్స్ రిజెక్ట్ చేస్తున్నారు.