సినిమా ఇండస్ర్టీలో నెపొటిజం గురించి చెప్పాల్సిన పనిలేదు. అదీ బాలీవుడ్ లో నెపొటిజంపై ఎప్పటికప్పుడు విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత నెపొటిజంపై దేశ వ్యాప్తంగా జరిగిన చర్చ గురించి తెలిసిందే. కంగనా రనౌత్..ప్రియాంక చోప్రా..దీపికా పదుకొణే లాంటి వారు అప్పుడప్పుడు నెపొటిజంపై నిప్పులు చెరుగుతుం టారు.
ఇండస్ర్టీని వారసత్వం మాత్రమే ఏల్తోంది! అన్నది నిజమే. కానీ ప్రతిభావంతుల్ని కూడా అక్కున చేర్చుకుంటుందతి అన్నది అంతే వాస్తవం. అయితే నెపోటిజాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని హీరోలైన వాళ్ల సంఖ్య ఎక్కువ కాబట్టి దాని డామినేషన్ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. బాలీవుడ్ తో పాటు..టాలీవుడ్ లోనూ ఈ కల్చర్ చాలా కాలంగా ఉంది.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు సక్సెస్ అయింది చాలా తక్కువ. ఇటీవలి కాలంలో ఆ సంఖ్య మెరుగు పడుతుందని చెప్పొచ్చు. తాజాగా నెపొటిజంపై బాలీవుడ్ నటి తారా సుతారియా స్పందించారు. బాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ ఉన్న నటులు..ఇంటి పేరుతో రాణిస్తున్న నటులతో కలిసి పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా.
ఎందుకంటే నేను ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి...బిగ్ స్టార్స్ తో నటించడం అంటే దాన్ని ఓ అచీవ్ మెంట్ గానే చెబుతాను. ``మా అమ్మా నాన్నలు సినిమా నేపథ్యం లేనివారు. కాబట్టి షూటింగ్ నుంచి ఇంటికి తిరిగి రాగానే సెట్స్ విషయాలు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంటుంది. వారు నా జీవితంలో సాధారణ స్థితిని ప్రదర్శిస్తారు. అది నన్ను తెలివిగా సంతోషంగా ఉంచుతుంది` అని పాజిటివ్ కోణంలోనే మాట్లాడింది. హీరోలపైగానీ..దర్శక-నిర్మాతలపై గానీ ఎలాంటి నెగిటివ్ కామెంట్లు చేయలేదు.
తారా సుతారియా కెరీర్ విషయానికి వస్తే.. టైగర్ ష్రాఫ్‌లతో కలిసి `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు దక్కింది. అటుపై సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `మార్జావాన్`.. టైగర్ ష్రాఫ్‌తో `హీరోపంతి 2` అహన్ శెట్టితో `తడప్` వంటి చిత్రాలలో నటించింది.
ప్రస్తుతం ఆమె `ఏక్ విలన్ రిటర్న్స్` లో నటిస్తుంది. ఇందులో అర్జున్ కపూర్.. దిశా పటానీ .. జాన్ అబ్రహంతో తెరని పంచుకుంటుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తతుం టీమ్ అంతా సినిమా ప్రచారం పనుల్లో బిజీగా ఉంది.