తారక్ 1019.. చెర్రీ 927.. డార్లింగ్ 696.. చిరంజీవి 663

Update: 2021-07-25 03:30 GMT
చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వెండితెర భోరుమంటోంది. కంటికి కనిపించని మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు దేశాలు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున వ్యాపారాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. మరే ఇతర ఇండస్ట్రీ కూడా ప్రభావితం కానంత దారుణ ప్రభావానికి గురైంది ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ. గడ ఏడాది మార్చి చివర్లో మొదలైన లాక్ డౌన్.. అనంతరం అన్ లాక్ అయినప్పటికీ చాలామంది స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు.. ఇక.. బొమ్మల్ని (సినిమాల్ని) బయటకు తీసుకొద్దామన్నంతలో సెకండ్ వేవ్ షురూ కావటం.. ఆ వెంటనే లాక్ డౌన్ విధించటంతో మరోసారి సినిమా థియేటర్లు మూసేశారు. మరికొద్ది రోజుల్లో మరోసారి థియేటర్లను రీఓపెన్ చేస్తారన్న వేళ.. స్టార్ హీరోలు పలువురు తమ సినిమాల్ని ఎప్పుడెప్పడు విడుదల చేద్దామా? అన్న ఆత్రుతతో ఉన్నారు.

గతానికి భిన్నంగా గడిచిన రెండు దశాబ్దాల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన మార్పు.. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయటం. శిల్పాన్ని చెక్కిన చందంగా తమ సినిమాల్ని తయారు చేస్తామని చెబుతూ.. ఒక సినిమాను పూర్తి చేసి విడుదలైన కొద్ది రోజుల తర్వాత కానీ మరో సినిమాను షురూ చేయని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఒక స్టార్ హీరో ఏడాదికి డజన్ కు పైగా సినిమాలు చేసిన పరిస్థితి నుంచి.. ఈ తరం టాప్ కథానాయకులు ఏడాదికి ఒక సినిమా చేయటమే గగనంగా మారిపోయింది.  

ఇదిలా ఉంటే.. అనూహ్యంగా కరోనా తెర మీదకు రావటంతో.. అప్పటివరకు విడుదలకు ప్లాన్ చేసిన చిత్రాలే కాదు.. విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు ఆగిపోయాయి. దీంతో.. టాప్ స్టార్లుగా చెప్పేటోళ్ల సినిమాలు రికార్డు స్థాయిలో వెండితెర మీద వెలిగిపోని పరిస్థితి నెలకొంది. స్టార్ హీరోలు పొదుపుగా సినిమాలు తీసే అలవాటుకు కరోనా తోడు కావటంతో ఎప్పుడు లేనంత ఎక్కువ గ్యాప్ ఈసారి చోటు చేసుకుంది. అది కూడా ఏ ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కాదు.. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్లందరి పరిస్థితి ఇదే తీరులో ఉంది. కరోనా దెబ్బకు స్టార్ హీరోల్లో వచ్చిన మార్పు.. ఒకే సినిమాతో రెండు మూడుసినిమాలు చేసేందుకు ఓకే చేయటమే కాదు.. వడివడిగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

స్టార్ కథానాయకుల్లో అత్యధిక కాలం వెండి తెర మీద కనిపించని టాలీవుడ్ హీరోల్లో మొదటిస్థానం జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ అని చెప్పాలి. తారక్ చివరి చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఆ సినిమా తర్వాత అతడి మూవీ ఏదీ విడుదల కాలేదు. దీనికి కారణం జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసమే. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కేటాయించారు తారక్. ఈ కారణంతో తారక్ సినిమాను ఆయన అభిమానులు చూసి ఏకంగా 1019 రోజులు అవుతోంది. ఇప్పటి హీరోల్లో ఇన్ని రోజుల పాటు వెండితెర మీద వెలగకుండా ఉన్న ఏకైక కథానాయకుడు ఆయనేనని చెప్పక తప్పదు.

తారక్ తర్వాతి చోటు రాంచరణ్ దేనని చెప్పాలి. అతడు నటించిన చివరి చిత్రం ‘వినయ విధేయ రామ’. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా చెర్రీని ఆయన అభిమానుల్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ప్రొడక్షన్ సమయంలో ఈ సినిమా గురించి విపరీతమైన హైప్ నడిచినా.. థియేటర్లో బొమ్మ పడిన తర్వాత ఈ సినిమా మీద పేలినన్ని జోకులు.. వచ్చిన మీమ్ లకు లెక్కే లేదని చెప్పాలి. రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం విపరీతంగా శ్రమిస్తున్న రాం చరణ్.. తన గత సినిమాతో ఎదురైన చేదు అపజయాన్ని జక్కన్న మూవీతో మర్చిపోయేలా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికి ఆయన సినిమా బయటకు వచ్చి 926 రోజులు అవుతోంది. ఈ అక్టోబరు 13న రిలీజ్ కావాలని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

బాహుబలి సినిమాతో జాతీయస్థాయిలోనే కాదు.. అంతర్జాతీయస్థాయిలోనే ప్రభాస్ కు ఒక ఐడెంటిటీ అయితే దొరికింది. ఆయన ఇన్ స్టెంట్ పాన్ ఇండియా నటుడిగా మారిపోయారు. ఈ ప్రయత్నంలో భాగంగా విడుదలైన సాహో సినిమా ఫలితం ఏమైందో అందరికి తెలిసిందే. బాహుబలి మూవీ కారణంగా తన కెరీర్ లో జరిగిన చిత్రాల ఆలస్యాన్ని పూడ్చుకోవాలన్న తపన డార్లింగ్ లో ఈ మధ్యన ఎక్కువైంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఆయన ఒకేసారి నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పేసి.. వర్కు చేస్తున్నారు.

ఆయన నటించిన రాథే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. పరిస్థితులు ఏ మాత్రం చక్కబడినా ఈ సినిమాతో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 696 రోజులు కావొస్తోంది. మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన సైరా 2019 అక్టోబరు 2న విడుదలైంది. అంటే.. నేటికి 663 రోజులు అన్న మాట. ఆయన నటించిన ఆచార్య సినిమా షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో విడుదల కావాల్సింది. కాకుంటే.. కరోనా ప్రభావం ఆ సినిమా మీదచాలానే పడింది. దీంతో.. గడిచిన 663 రోజులుగామెగాస్టార్ మూవీ ఏదీ వెండితెర మీద తళుక్కుమనలేదు.

గత సంక్రాంతికి రోజు తేడాతో తళుక్కుమన్న ఇద్దరు టాప్ కథానాయకులు మహేశ్ బాబు.. అల్లు అర్జున్. వీరిద్దరు నటించిన సినిమా సూపర్ హిట్ గా నిలిచాయి. మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ విజయవంతంగా కాగా.. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలారోజు వ్యవధిలో విడుదల రెండు సినిమాలు ఘన విజయాల్ని సాధించి సంక్రాంతి హుషారును మరింత పెంచాయి.

అనూహ్యంగా వచ్చి పడిన కరోనాదెబ్బకు ఇండస్ట్రీపై పిడుగు మాదిరి మారింది. వారిద్దరూ వెండితెర మీద తళ్కుమని 562(మహేశ్ బాబు).. 561 (అల్లుఅర్జున్) రోజులు అయ్యాయి. వీరే కాదు.. టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోల సినిమాలు విడుదలై 500 రోజులకు పైనే పడినోళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఈ గ్యాప్ ను ఈ ఏడాది పూర్తి అయ్యే లోపు తీర్చేస్తుందని ఆశిద్దాం. మరేం జరుగుతుందో చూడాలి.చరిత్రలో ఎప్పుడూ లేనంతగా వెండితెర భోరుమంటోంది. కంటికి కనిపించని మహమ్మారి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు దేశాలు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున వ్యాపారాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. మరే ఇతర ఇండస్ట్రీ కూడా ప్రభావితం కానంత దారుణ ప్రభావానికి గురైంది ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ. గడ ఏడాది మార్చి చివర్లో మొదలైన లాక్ డౌన్.. అనంతరం అన్ లాక్ అయినప్పటికీ చాలామంది స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయలేదు.. ఇక.. బొమ్మల్ని (సినిమాల్ని) బయటకు తీసుకొద్దామన్నంతలో సెకండ్ వేవ్ షురూ కావటం.. ఆ వెంటనే లాక్ డౌన్ విధించటంతో మరోసారి సినిమా థియేటర్లు మూసేశారు. మరికొద్ది రోజుల్లో మరోసారి థియేటర్లను రీఓపెన్ చేస్తారన్న వేళ.. స్టార్ హీరోలు పలువురు తమ సినిమాల్ని ఎప్పుడెప్పడు విడుదల చేద్దామా? అన్న ఆత్రుతతో ఉన్నారు.

గతానికి భిన్నంగా గడిచిన రెండు దశాబ్దాల కాలంలో టాలీవుడ్ లో వచ్చిన మార్పు.. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయటం. శిల్పాన్ని చెక్కిన చందంగా తమ సినిమాల్ని తయారు చేస్తామని చెబుతూ.. ఒక సినిమాను పూర్తి చేసి విడుదలైన కొద్ది రోజుల తర్వాత కానీ మరో సినిమాను షురూ చేయని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఒక స్టార్ హీరో ఏడాదికి డజన్ కు పైగా సినిమాలు చేసిన పరిస్థితి నుంచి.. ఈ తరం టాప్ కథానాయకులు ఏడాదికి ఒక సినిమా చేయటమే గగనంగా మారిపోయింది.  

ఇదిలా ఉంటే.. అనూహ్యంగా కరోనా తెర మీదకు రావటంతో.. అప్పటివరకు విడుదలకు ప్లాన్ చేసిన చిత్రాలే కాదు.. విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు ఆగిపోయాయి. దీంతో.. టాప్ స్టార్లుగా చెప్పేటోళ్ల సినిమాలు రికార్డు స్థాయిలో వెండితెర మీద వెలిగిపోని పరిస్థితి నెలకొంది. స్టార్ హీరోలు పొదుపుగా సినిమాలు తీసే అలవాటుకు కరోనా తోడు కావటంతో ఎప్పుడు లేనంత ఎక్కువ గ్యాప్ ఈసారి చోటు చేసుకుంది. అది కూడా ఏ ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు కాదు.. ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్లందరి పరిస్థితి ఇదే తీరులో ఉంది. కరోనా దెబ్బకు స్టార్ హీరోల్లో వచ్చిన మార్పు.. ఒకే సినిమాతో రెండు మూడుసినిమాలు చేసేందుకు ఓకే చేయటమే కాదు.. వడివడిగా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.

స్టార్ కథానాయకుల్లో అత్యధిక కాలం వెండి తెర మీద కనిపించని టాలీవుడ్ హీరోల్లో మొదటిస్థానం జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ అని చెప్పాలి. తారక్ చివరి చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఆ సినిమా తర్వాత అతడి మూవీ ఏదీ విడుదల కాలేదు. దీనికి కారణం జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసమే. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కేటాయించారు తారక్. ఈ కారణంతో తారక్ సినిమాను ఆయన అభిమానులు చూసి ఏకంగా 1019 రోజులు అవుతోంది. ఇప్పటి హీరోల్లో ఇన్ని రోజుల పాటు వెండితెర మీద వెలగకుండా ఉన్న ఏకైక కథానాయకుడు ఆయనేనని చెప్పక తప్పదు.

తారక్ తర్వాతి చోటు రాంచరణ్ దేనని చెప్పాలి. అతడు నటించిన చివరి చిత్రం ‘వినయ విధేయ రామ’. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా చెర్రీని ఆయన అభిమానుల్ని తీవ్రంగా నిరాశకు గురి చేసింది. ప్రొడక్షన్ సమయంలో ఈ సినిమా గురించి విపరీతమైన హైప్ నడిచినా.. థియేటర్లో బొమ్మ పడిన తర్వాత ఈ సినిమా మీద పేలినన్ని జోకులు.. వచ్చిన మీమ్ లకు లెక్కే లేదని చెప్పాలి. రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం విపరీతంగా శ్రమిస్తున్న రాం చరణ్.. తన గత సినిమాతో ఎదురైన చేదు అపజయాన్ని జక్కన్న మూవీతో మర్చిపోయేలా చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికి ఆయన సినిమా బయటకు వచ్చి 926 రోజులు అవుతోంది. ఈ అక్టోబరు 13న రిలీజ్ కావాలని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

బాహుబలి సినిమాతో జాతీయస్థాయిలోనే కాదు.. అంతర్జాతీయస్థాయిలోనే ప్రభాస్ కు ఒక ఐడెంటిటీ అయితే దొరికింది. ఆయన ఇన్ స్టెంట్ పాన్ ఇండియా నటుడిగా మారిపోయారు. ఈ ప్రయత్నంలో భాగంగా విడుదలైన సాహో సినిమా ఫలితం ఏమైందో అందరికి తెలిసిందే. బాహుబలి మూవీ కారణంగా తన కెరీర్ లో జరిగిన చిత్రాల ఆలస్యాన్ని పూడ్చుకోవాలన్న తపన డార్లింగ్ లో ఈ మధ్యన ఎక్కువైంది. గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఆయన ఒకేసారి నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పేసి.. వర్కు చేస్తున్నారు.

ఆయన నటించిన రాథే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. పరిస్థితులు ఏ మాత్రం చక్కబడినా ఈ సినిమాతో తన ఫ్యాన్స్ ను ఖుషీ చేయాలని భావిస్తున్నారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 696 రోజులు కావొస్తోంది. మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన నటించిన సైరా 2019 అక్టోబరు 2న విడుదలైంది. అంటే.. నేటికి 663 రోజులు అన్న మాట. ఆయన నటించిన ఆచార్య సినిమా షెడ్యూల్ ప్రకారం ఎప్పుడో విడుదల కావాల్సింది. కాకుంటే.. కరోనా ప్రభావం ఆ సినిమా మీదచాలానే పడింది. దీంతో.. గడిచిన 663 రోజులుగామెగాస్టార్ మూవీ ఏదీ వెండితెర మీద తళుక్కుమనలేదు.

గత సంక్రాంతికి రోజు తేడాతో తళుక్కుమన్న ఇద్దరు టాప్ కథానాయకులు మహేశ్ బాబు.. అల్లు అర్జున్. వీరిద్దరు నటించిన సినిమా సూపర్ హిట్ గా నిలిచాయి. మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ విజయవంతంగా కాగా.. అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలారోజు వ్యవధిలో విడుదల రెండు సినిమాలు ఘన విజయాల్ని సాధించి సంక్రాంతి హుషారును మరింత పెంచాయి.

అనూహ్యంగా వచ్చి పడిన కరోనాదెబ్బకు ఇండస్ట్రీపై పిడుగు మాదిరి మారింది. వారిద్దరూ వెండితెర మీద తళ్కుమని 562(మహేశ్ బాబు).. 561 (అల్లుఅర్జున్) రోజులు అయ్యాయి. వీరే కాదు.. టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోల సినిమాలు విడుదలై 500 రోజులకు పైనే పడినోళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఈ గ్యాప్ ను ఈ ఏడాది పూర్తి అయ్యే లోపు తీర్చేస్తుందని ఆశిద్దాం. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News