తనకు పబ్ ఉన్నట్లు వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సినీనటుడు తరుణ్ అన్నారు. సిట్ విచారణకు తన తండ్రితో కలిసి బయలుదేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ఏడేళ్ల కిందట ఒక పబ్ లో భాగస్వామ్యం ఉన్న మాట వాస్తవమేననీ, అయితే ఆరేళ్ల కిందటే ఆ భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నానని తరుణ్ వెల్లడించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు.
కాగా విచారణ 10 గంటలకు మొదలుకానుండగా ఆయన సిట్ కార్యాలయానికి 9.10 నిమిషాలకే చేరుకున్నారు. తరుణ్ స్వయంగా జాగ్వార్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. కెల్విన్ ఫోన్ లిస్టులో తరుణ్ నంబర్ కూడా ఉండటంతో డ్రగ్స్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. కెల్విన్ తో తరుణ్ చాట్ చేసినట్లు కూడా గుర్తించారు. తరుణ్ కు స్వయంగా ఓ పబ్ కూడా ఉండటం.. అక్కడి నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు కెల్విన్ చెప్పిన నేపథ్యంలో.. ఆయన కోసం ప్రత్యేక ప్రశ్నావళిని సిట్ అధికారులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
సుబ్బరాజు లాగే తరుణ్ కూడా బుకాయిస్తాడా? లేక స్వయంగా నిజాలు అంగీకరిస్తాడా? అన్నది వేచి చూడాలి. మొత్తానికి తరుణ్ నోరు విప్పితే మాత్రం మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కాగా ఈ డ్రగ్స్ వ్యవహారం ఇంతగా వెలుగులోకి రాకముందే చాలాకాలం కిందట నుంచి తరుణ్ పై డ్రగ్స్ సంబంధిత ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన విచారణ అత్యంత కీలకమని తెలుస్తోంది.