ఇలా మాట్లాడితే ఎలా డైరెక్టర్ గారూ..?

Update: 2018-07-01 08:12 GMT
‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తరుణ్ భాస్కర్. ఐతే విడుదలకు ముందు మాత్రమే అది చిన్న సినిమా. కానీ రిలీజ్ తర్వాత అది పెద్ద రేంజికి వెళ్లింది. మంచి వసూళ్లు సాధించింది. అవార్డులూ కొల్లగొట్టింది. ఐతే ఆ చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో మీడియా పాత్ర కీలకం. విడుదలకు ముందే దీని గురించి సెలబ్రెటీలు.. క్రిటిక్స్ ప్రివ్యూలు చూసి మంచి సినిమా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ముందే చాలా మంది పాజిటివ్ రివ్యూలు కూడా రాశారు. రిలీజ్ తర్వాత కూడా ఈ చిత్రం జనాల్లోకి వెళ్లడంలో మీడియా పాత్ర కీలకమైంది. అప్పుడు దాన్నంతా బాగా ఎంజాయ్ చేశాడు తరుణ్ భాస్కర్. కానీ తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’లో లోపాలు వెతికితే అతడికి నచ్చట్లేదు. ఈ చిత్రం బాలేదని ఎవ్వరూ అనలేదు. ఎవ్వరూ పూర్తి నెగెటివ్ రివ్యూలు కూడా ఇవ్వలేదు.

పెళ్ళిచూపులు’ తరహాలో పకడ్బందీగా సినిమా లేదని.. ఇందులో కథ బలహీనంగా ఉందని.. లోపాలు ఉన్నాయని.. వాటిని ఎత్తి చూపించారు. చాలా వరకు అందరూ నిర్మాణాత్మకమైన విమర్శలే చేశారు. ఈ సినిమా వేస్ట్ అని తేల్చేయలేదు. బాగున్న విషయాల్ని బాలేదని అనలేదు. కానీ తరుణ్ ఈ విమర్శల్ని తట్టుకోలేకపోయాడు. తన అసహనాన్నంతా సోషల్ మీడియా ద్వారా చూపించేశాడు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ‘పెళ్ళిచూపులు’కు క్రిటిక్స్ ఇచ్చిన సపోర్ట్ మరిచిపోయి.. వాళ్ల మీదే విమర్శలు గుప్పించాడు. తన సినిమాను పొగిడినపుడు ఎంజాయ్ చేసి.. ఇప్పుడు మరో సినిమాలో లోపాలు ఎత్తి చూపినందుకు అంత అసహనం వ్యక్తం చేస్తే ఎలా? అయినా టాలీవుడ్లో వచ్చిన ఒక గొప్ప మార్పులో భాగం అయిన దర్శకుడి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
Tags:    

Similar News