ఆ డైరెక్టర్ ని అఖిల్ ముందే అడిగాడట

Update: 2016-08-14 17:18 GMT
కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లి చూపులు ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తోందో చూస్తూనే ఉన్నాం. అన్ని ఏరియాల్లోనూ ఇంకా స్ట్రాంగ్ గా నిలబడిందీ సినిమా. మరోవైపు టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండడం పెళ్లిచూపులకు బాగా కలిసొస్తోంది. ఇప్పుడు ఈ మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన అక్కినేని అఖిల్ దర్శకుడి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ చెప్పాడు.

పెళ్లిచూపులు చిత్రానికి ముందే దర్శకుడు తరుణ్ భాస్కర్ ని కలిశాడట అఖిల్. తన టేకింగ్ బాగా నచ్చి.. ఓ లవ్ స్టోరీ ఉంటే చేద్దామని ఆఫర్ కూడా ఇచ్చానన్నాడు. కానీ తరుణ్ మాత్రం నన్ను రిజెక్ట్ చేశాడని నవ్వుతూ చెప్పాడు అఖిల్. 'నాతో సినిమా తీయమంటే తరుణ్ రిజెక్ట్ చేశాడు. నా దగ్గర స్టోరీ లేదన్నాడు. షార్ట్ ఫిలింలో అతని రియల్ ట్యాలెంట్ చూసి అతనితో వర్క్ చేద్దామని అనుకున్నాను. తర్వాత పెళ్లి చూపులు తీశాడు. ఈ సినిమా చాలా ఫ్రెష్ నెస్ ఉంది. సినిమాలో చాలా మూమెంట్స్ మనతో రిలేట్ అవుతాయి. నాక్కూడా చాలా సీన్లు కనెక్ట్ అయ్యాయి. సినిమా యూత్ కి కనెక్ట్ అవడానికి కారణం ఇదే' అని చెప్పాడు అఖిల్.

తరుణ్ భాస్కర్ ఎప్పుడు తనతో సినిమా చేస్తానన్నా.. సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చేశాడు అఖిల్.




Tags:    

Similar News