స్టార్ హీరోలతో చేయనంటే ఎలా?

Update: 2018-06-28 10:35 GMT

పెళ్లిచూపులు సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ మూవీ మంచి కలెక్షన్లతోపాటు నేషనల్ అవార్డును కూడా దక్కించుకుంది. సుదీర్ఘ విరామం తరవాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ ‘నగరానికి ఏమైంది’ సినిమా డైరెక్ట్ చేశాడు తరుణ్ భాస్కర్.

జీవితంలో ఏ గోల్ లేకుండా తిరిగే నలుగురు కుర్రాళ్లు షార్ట్ ఫిలిం తీయాలనుకుని రెడీ అవుతారు. అందుకోసం వాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.. అది వాళ్ల లైఫ్ ని ఎలా మారుస్తుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. పెళ్లిచూపులు తరవాత తరుణ్ భాస్కర్ కు పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ డైరెక్టర్ మాత్రం స్టార్లతో సినిమా తీయడం తన వల్ల కాదంటున్నాడు. అదేమంటే ఇంకా హీరోల చుట్టూ కథలు అల్లే టాలెంట్ ఇంకా రాలేదని.. కథ సిద్ధం చేసుకున్నాకే అందులో ఎవరిని తీసుకోవాలనేది డిసైడ్ అవుతానని చెప్పుకొచ్చాడు.

ఈ నగరానికి ఏమైంది సినిమాలో కాస్టింగ్ ఎంపికకే తరుణ్ భాస్కర్ కు రెండు నెలలకు పైగా టైం పట్టిందట.  అసలే టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్లకే కొరత ఉంది. స్టార్ హీరోలు కూడా మూస పాత్రలు వదిలేసి కొత్తగా ఏదో ట్రయ్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైంలో టాలెంటుండీ స్టార్ హీరోలతో సినిమాలు తీయలేననడం ఏం న్యాయం తరుణ్ భాస్కర్?



Tags:    

Similar News