సింహంతో లంచ్ చేస్తున్న తరుణ్

Update: 2023-01-19 14:33 GMT
ఒకప్పుడు లవర్ బాయ్‌గా తెలుగు సినీ ప్రేక్షకులందరినీ అలరించిన తరుణ్... ప్రస్తుతానికి సినిమా లేక సైలెంట్ అయ్యాడు. ఒకపక్క తల్లి స్టార్ హీరోయిన్.. మరోపక్క తండ్రి ఒకప్పటి స్టార్ హీరో.. కావడంతో ప్రస్తుతానికి సినిమాలేవి లేకపోయినా హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేసేస్తున్నాడు. తండ్రి హీరో కావడం... తల్లి హీరోయిన్ కావడంతో చిన్నప్పుడే బాల నటుడిగా మనసు మమత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు తరుణ్.

ఆ తర్వాత కాలంలో వచ్చిన నువ్వే కావాలి అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తరుణ్ కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే పడలేదు. ఆ తర్వాత కొత్త హీరోల ఎంట్రీ ఇవ్వడం తరుణ్ ఎంచుకున్న కథల్లో కొత్తదనం లేకపోవడంతో ఆయన చేస్తున్న సినిమాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. కొన్నాళ్ల క్రితం నుంచి తరుణ్ పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు అని చెప్పక తప్పదు.  

40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి జోలికి పోని ఈ హీరో... ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఇండోనేషియా రాజధాని బాలి వెళ్లిన తరుణ్ అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేయడమే కాక... పలు రెస్టారెంట్లకు కూడా తిరుగుతూ టైం స్పెండ్ చేస్తున్నాడు.

తాజాగా సింహాలతో కూడిన ఒక రెస్టారెంట్‌కి వెళ్లి అక్కడ ఫుడ్ తింటూ... తన పక్కనే సింహం నుంచుని ఉన్న ఒక వీడియో షేర్ చేశారు. అది ఆడ సింహం కావడం గమనార్హం.

ఆడ సింహాలను శివంగి అని పిలుస్తారు కదా. ఇక తరుణ్ చాలాకాలం తర్వాత ఒక వీడియో షేర్ చేయడంతో దానిపై ఆయన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణ్ ఆ సినిమా కూడా కలిసి రాకపోవడంతో మరో సినిమా జోలికి వెళ్లలేదని తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఆయన మంచి కం బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తరుణ్ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ఒక ఓటీటీ ప్రాజెక్టు కూడా అవకాశం ఉందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View



Tags:    

Similar News