వసూళ్ల పరంగా నందమూరి బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ సినిమా రూ.40 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. కానీ బాలయ్య వందో సినిమాను స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న క్రిష్.. ఈ సినిమాకు రూ.70 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేశాడు. ఇది చాలా పెద్ద రిస్క్ అని అంతా అనుకున్నారు కానీ.. బాలయ్య మార్కెట్ స్థాయి మీద 50 శాతం అదనంగా బిజినెస్ అయ్యేలా సినిమాకు క్రేజ్ తీసుకురావడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడు.
అయినప్పటికీ ఈ సినిమా డెఫిషిట్ తోనే రిలీజయ్యేలా ఉంది. ఐతే ఆ డెఫిషిట్ పూడేలా ఈ సినిమాకు ఇప్పుడో మంచి అవకాశం దొరికినట్లు సమాచారం. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వినోదపు పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉందట. ఈ మేరకు బాలయ్యే రంగంలోకి దిగి.. సానుకూల నిర్ణయం వచ్చేలా చూస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం నుంచి ఈ విషయంలో పూర్తి సహకారం ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆమోద ముద్ర వేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ‘రుద్రమదేవి’ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా కూడా మన చరిత్ర గురించి చెప్పే మంచి కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో పన్ను మినహాయింపు ఇవ్వడానికి తెలంగాణ సర్కారు కూడా పెద్దగా ఆలోచించకపోవచ్చు. వసూళ్లలో 15 శాతం వినోదపు పన్నుగా పోతుంది. ఆ మేరకు నిర్మాతకు మిగులే కాబట్టి.. ఈ మేరకు నిర్ణయం వస్తే క్రిష్ దాదాపుగా సేఫ్ అయిపోయినట్లే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/