అల్లు అర్జున్ పుష్ప సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2021 సినిమాలో విడుదల అయిన ఇండియన్ సినిమాల్లో పుష్ప నెం.1 గా నిలిచింది. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన పుష్ప ఒక్క హిందీలో ఏకంగా 80 కోట్లకు మించి వసూళ్లు నమోదు చేయడం జరిగింది. హిందీలో పాతిక కోట్ల వసూళ్లు నమోదు అయితే చాలా గొప్ప విషయం అన్నట్లుగా విశ్లేషకులు భావించారు. కానీ ఏకంగా 80 కోట్ల రూపాయలను అక్కడ పుష్ప రాబట్టింది. ఇతర సినిమాలు లేకపోవడంతో పాటు పుష్పకు వచ్చిన పాజిటివ్ టాక్ మరియు సెలబ్రెటీల బైట్స్ ట్వీట్స్ తో అక్కడ మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ మరియు ఇతర సినిమా రంగ ప్రముఖులు.. స్టార్స్ పుష్ప పై ప్రశంసల వర్షం కురిపించారు.
పుష్ప సినిమాపై పలువురు టీం ఇండియా ఆటగాళ్లు కూడా కామెంట్ చేయడం సినిమాకు కలిసి వచ్చింది. డేవిడ్ వార్నర్ మొదలుకుని జడేజా.. కోహ్లీ ఇప్పుడు శిఖర దావన్ ఇలా చాలా మంది టీం ఇండియా ఆటగాళ్లు ఇతరులు నీ అవ్వ తగ్గేదే లే అన్న డైలాగ్ చెప్పి సినిమాను బాగా మోసేశారు. పుష్ప సినిమా గురించి ఒక్కో క్రికెటర్ ఒక్కో విధంగా పాజిటివ్ వే లో స్పందించి సినిమాపై జనాల్లో ఆసక్తి పెంచేశారు. చాలా మంది టీం ఇండియా ఆటగాళ్ల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. అక్కడ సినిమా రన్ పూర్తి అయినా కూడా క్రికెట్ ప్రముఖుల ప్రశంసల ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా శిఖర్ దావన్ పుష్ప డైలాగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.
ఆటతో ఎప్పుడూ బిజీగా ఉండే క్రికెటర్స్ ఇటీవల వరుసగా పుష్ప సినిమా గురించి మాట్లాడటం.. సినిమాలోని డైలాగ్ చెప్పడం చూస్తుంటే ముచ్చటేస్తుందని అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ స్టార్ హీరోల్లో ఇంత మంది టీమ్ ఇండియా క్రికెటర్ ల ప్రశంసలు.. జాతీయ స్థాయి స్టార్స్ ప్రశంసలు కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే దక్కి ఉంటాయి అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమా ఒక మంచి సమయంలో విడుదల అయ్యింది. పోటీ లేని సమయంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే ముందు విడుదల అవ్వడం తో కలిసి వచ్చింది.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించాడు. సునీల్ మరియు అనసూయలు పుష్ప లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన విషయం తెల్సిందే. పుష్ప పార్ట్ 1 కు వస్తున్న ఆధరణ తో పుష్ప పార్ట్ 2 పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి లేదా మార్చిలో షూటింగ్ ను ప్రారంభించి సరిగ్గా పుష్ప పార్ట్ 1 విడుదల అయిన డిసెంబర్ లోనే పార్ట్ 2 ను కూడా విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.
Full View