'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్''. అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ లో 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ మరియు 2013 దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల వెనుకున్న ప్రధాన సూత్రధారులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ కథను చూపించబోతున్నారు. నాగ్ ఈ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ అనే ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సెల్యూట్ చేస్తూ 'వైల్డ్ డాగ్' టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది.
2013 ఫిబ్రవరి 21న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. 130 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీనికి ఇన్వెస్టిగేట్ చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగి యూపీ - బీహార్ - మహారాష్ట్రలలో దాడులు జరిపి.. పేలుళ్ల వెనుకున్న 5గురు ఇండియన్ ముజాయుద్దీన్ టెర్రరిస్టులను పట్టుకున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొన్న ఎన్ఐఏ ఆఫీసర్స్ ఎస్ సి సిన్హా - నవనీత్ రాజన్ వషన్ - పీవీ రామశాస్త్రి లకు 'వైల్డ్ డాగ్' టీమ్ సెల్యూట్ చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చగా.. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు. డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ చిత్రంలో సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.