తమిళ్ స్టార్ హీరో ధనుష్ డబ్బింగ్ సినిమాల ద్వారా టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''సార్'' అనే స్ట్రెయిట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈరోజు (జులై 28) హీరో ధనుష్ పుట్టిన రోజు కావడంతో నిన్ననే 'సార్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఓ లైబ్రరీలో కూర్చొని శ్రద్ధగా నోట్స్ రాసుకుంటున్న ధనుష్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ లాంచ్ చేశారు.
'జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్.. ఇదే ఇప్పుడు ట్రెండ్' అని చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇందులో బాలగంగాధర తిలక్ అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో ధనుష్ ను పరిచయం చేసారు. అలానే తనదైన శైలి యాక్షన్ తో అదరగొట్టడం చూపించారు.
మన దేశంలోని విద్యావ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే కథాంశంతో ''సార్'' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ధనుష్ విభిన్నమైన లుక్స్ లో కనిపించడాన్ని బట్టి చూస్తే.. ఈ కథ అతని జీవితంలోని వివిధ దశలను చూపుతుందని అర్థం అవుతోంది. అంతేకాదు అతను రెండు పాత్రల్లో కనిపిస్తారనే సందేహాలను కలిగిస్తోంది.
'విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్.. పంచండి.. ఫైవ్ స్టార్ హోటల్ లో డిష్ లాగా అమ్మకండి' అని ధనుష్ చెప్పే డైలాగ్ బాగుంది. కాకపోతే ధనుష్ తెలుగు డబ్బింగ్ మాత్రం డిఫరెంట్ గా అనిపిస్తుంది.
ఇకపోతే ధనుష్ శైలి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా మంచి సందేశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విద్య అనేది పుస్తకాలు, మార్కులు మరియు ఫలితాల కంటే ఎక్కువ అనే విషయాన్ని ఈ సినిమాతో చెప్పబోతున్నారు.
ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని - సాయి కుమార్ - తనికెళ్ళ భరణి - ఆడుకాలమ్ నరేన్ - హరీష్ పేరడీ - తోటపల్లి మధు - పమ్మి సాయి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
'సార్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందిస్తోంది. సూర్యదేవర నాగ వంశీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జీవీ ప్రకాష్ కుమార్ ఈ బైలింగ్విల్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
'తొలిప్రేమ' 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. ఈసారి ధనుష్ తో కలిసి ''సార్'' సినిమాతో ఓ సీరియస్ సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నాడని అర్థమవుతోంది. తమిళ్ ఈ సినిమాని 'వాతి' పేరుతో విడుదల చేయనున్నారు.
Full View