మేజిక్ రీక్రియేట్ చేశారు : టీజర్ టాక్

Update: 2019-04-08 11:21 GMT
తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన అర్జున్ రెడ్డి రీమేక్ ఇతర బాషలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ఆ మధ్య తమిళ్ లో మొత్తం షూటింగ్ పూర్తయ్యాక ఫైనల్ కాపీ చూసి మరీ క్యాన్సిల్ చేసి మళ్ళి కొత్తగా తీయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు మారాడు కాబట్టి ఇంపాక్ట్ లో బాగా తేడా కొట్టేసింది. అందుకే హిందీ నిర్మాతలు చాలా తెలివిగా ఫీల్ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో కబీర్ సింగ్ కోసం సందీప్ రెడ్డి వంగానే లాక్ చేసుకున్నారు. దీని టీజర్ ఇందాకా విడుదలైంది.

దీని విషయానికి వస్తే విజువల్స్ లో ఒరిజినల్ వెర్షన్ ను చెడగొట్టకుండా సాధ్యమైనంత అదే ఫీల్ ని క్యారీ చేస్తూ మంచి క్వాలిటీ మేకింగ్ తో మేజిక్ ని రీ క్రియేట్ చేసే ప్రయత్నం గట్టిగానే కనిపించింది. కథలో ఎలాంటి మార్పు లేకుండా దాదాపు మక్కికి మక్కి దించినట్టే ఉంది కానీ నార్త్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మేకింగ్ లో చేసిన  కొన్ని మార్పులు బాగా సింక్ అయ్యాయి

షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా పరకాయ ప్రవేశం చేశాడు. నిజానికి తనను ఎంచుకున్నప్పుడు అందరికి డౌట్ వచ్చింది. విజయ్ దేవరకొండ కంటే వయసులో అనుభవంలో షాహిద్ కపూర్ చాలా సీనియర్. అలాంటప్పుడు ఫ్రెష్ గా అనిపించాల్సిన ఈ కాలేజీ కుర్రాడి పాత్ర సూట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటికి పూర్తిగా చెక్ పెడుతూ రెండు షేడ్స్ లో ఉండే కబీర్ సింగ్ గాషాహిద్ కపూర్ పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచాడు.

లుక్స్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు మంచి అవుట్ ఫుట్ ఇచ్చాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యధాతధంగా వాడుకున్నారు. పెద్దగా మార్పు లేదు. హీరోయిన్ కియారా అద్వానీ సింగల్ షాట్ కి పరిమితమయ్యింది. త్వరలో ట్రైలర్ విడుదల కానున్న కబీర్ సింగ్ మొత్తానికి అంచనాలు నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Full View
Tags:    

Similar News