మైత్రీ మూవీ మేకర్స్ లిస్టులో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులే ఉన్నాయి కానీ అన్నిటిలో క్రేజీ ప్రాజెక్టు మాత్రం 'పుష్ప'. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఒక్కసారిగా అందరి దృష్టి 'పుష్ప' వైపు మళ్లింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్.. 'అల వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ స్థాయిలో అమ్మాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కరోనా కల్లోలం.. అది సినిమా బిజినెస్ పైచూపించే ప్రభావం చూస్తుంటే 'పుష్ప'నిర్మాతలకు అది కష్టమైన పనేనని అంటున్నారు. ఉదాహరణకు నైజాం ఏరియా రైట్స్ విషయమే తీసుకుంటే 'అల వైకుంఠపురములో' సినిమాకు రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈలెక్కన 'పుష్ప' నైజాం రైట్స్ కాస్త ఎక్కువగా రూ. 45 కోట్లకు అమ్మాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నిర్మాతలైన మైత్రీ వారికి కత్తిమీద సామేనని చెప్పక తప్పదు.
ఇప్పటికే 'RRR' రైట్స్ తీసుకున్న కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. రేట్లు తగ్గించమని మరోసారి బేరాలాడుతున్నారనే టాక్ ఉంది. కరోనా కల్లోలం తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు ఎంతమాత్రం వస్తారో.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేపోతున్నారు. దీంతో ఇతర స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇదే పరిస్థితి తప్పదని అంటున్నారు. పుష్ప విషయమే తీసుకుంటే 'ఆలా వైకుంఠపురములో'కంటే తక్కువ రేట్లకు అమ్మలేరు. ఒకవేళ తక్కువ ధరలకే అమ్ముదామని రెడీ అయినా అల్లు క్యాంప్ వారు ఊరుకోరు. అలా అని సొంతంగా రిలీజ్ చేసుకుందామంటే పెట్టుబడి వెనక్కు వస్తుందో లేదో తెలియదు. ఇది మైత్రీ వారికి టెన్షన్ తెప్పించే వ్యవహారమే అంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ సమయానికి పరిస్థితులు చక్కబడతాయేమో వేచి చూడాలి.