తేజ్ రోడ్డు యాక్సిడెంట్: హెల్మెట్ ఎందుకు ఎగిరి పడిపోయింది?

Update: 2021-09-11 03:07 GMT
తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో మంచి చెడుల గురించి చూస్తే.. మితిమీరిన వేగం ప్రమాదానికి అసలు కారణంగా చెప్పాల్సి వస్తే.. హెల్మెట్ పెట్టుకోవటం తేజ్ చేసిన అతి మంచి పనిగా చెప్పక తప్పదు. ఆయన ప్రమాణిస్తున్న రోడ్డు మీద గంటకు 40 -50 కిలోమీటర్ల స్పీడ్ కు మించి వెళ్లే పరిస్థితి లేదు. ట్రాఫిక్ తక్కువగా ఉన్న వేళలో.. గంటకు 60 కి.మీ. స్పీడ్ తో వెళుతుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ నడుపుతున్న బైక్ స్పీడ్ గంటకు 70కి.మీ. కంటే ఎక్కువ వేగంతోనే వెళ్లి ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

కేవలం సెకనులో జరిగిన ప్రమాదం.. మూడు నుంచి ఐదు సెకన్ల వ్యవధిలో అతడు అపస్మారక స్థితిలోకి జారిపోవటం గమనార్హం. ప్రమాదం జరగనంత వరకు దాని తీవ్రత ఎంతలా ఉంటుందన్న విషయాన్ని అస్సలు అంచనా వేయలేరు. తేజ్ యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలిస్తే.. అతి వేగం.. బండి నియంత్రణను మిస్ కావటంతో పాటు.. బండిని వంపుగా తిప్పటంలో జరిగిన చిన్న పొరపాటు.. బండిని స్కిడ్ అయ్యేలా చేసింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్.. తలకు హెల్మెట్ ఉంది. కానీ.. కింద పడిపోయిన వేళలో.. తలకు ఉన్న హెల్మెట్ వీడిపోయి.. కొంత దూరాన పడిపోయింది. ఎందుకిలా జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. తలకు హెల్మెట్ పెట్టుకున్నా.. చాలామంది కింద ఉన్న స్ట్రిప్ ను పెట్టుకోకుండా వదిలేస్తుంటారు. చట్ట ప్రకారం చూస్తే.. తలకు హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో..కింద ఉన్న స్ట్రిప్ ను తగిలించుకోవటం అంతే ముఖ్యం.

చాలామంది హెల్మెట్ పెట్టుకునే వాహనదారులు..ఈ స్ట్రిప్ పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అంత ప్రమాదం జరగదన్న ధీమాతో పెట్టుకోరు. కానీ.. హెల్మెట్ పెట్టుకోవటం ఎంత ముఖ్యమో.. స్ట్రిప్ తగిలించుకోవటం అంతే ముఖ్యం. తాజా ప్రమాదంలో లక్కీగా తేజ్ హెల్మెట్ ఊడి కిందకు వచ్చేసినప్పటికి.. తలకు ఎలాంటి గాయం తగలకపోవటం గమనార్హం.
Tags:    

Similar News