మొన్నటిదాకా హీరోలపై తేజ ఘాటైన కామెంట్లు చేస్తుంటే... తన సినిమా `హోరా హోరీ`పై ప్రేక్షకుల అటెన్షన్ ఉండాలనే అలా మాట్లాడుతున్నాడని అనుకొన్నారంతా. మహేష్ లాంటి హీరో గురించి నానా రకాలుగా మాట్లాడినా అదంతా ప్రమోషన్స్ లో భాగమే అని ఊహించాయి పరిశ్రమ వర్గాలు. అయితే ఇప్పుడు సినిమా విడుదలైనా - ఫ్లాప్ టాక్ ని మూటగట్టుకొన్నా తేజ మాత్రం ఆగడం లేదు. టీవీ ఆఫీసుల్లో కూర్చుని హీరోలపై మరింత ఘాటైన కామెంట్ లు చేస్తున్నాడు. ఈసారి ఆయన తన హీరోలపై పడ్డాడు. అవకాశాలు ఇచ్చి స్టార్ లని చేస్తే - ఆ విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నారని తేజ మండి పడ్డాడు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తేజ మాట్లాడుతూ హీరోలు ఎవరి వల్ల లైఫ్ వచ్చిందో మర్చిపోతారని, వాళ్లకు విశ్వాసం లేదని కామెంట్ లు చేశాడు.
తన సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ కి పిలుద్దామని హీరోలకు ఫోన్లు చేసినా వాళ్లెవ్వరూ స్పందించలేదట. ఆ విషయాన్ని గుర్తు చేసుకొంటూ... అప్పుడే వాళ్లకు అంత పొగరొచ్చిందని, హీరోల్లో చాలామంది వేస్ట్ ఫెలోస్ అని మండిపడ్డాడు తేజ. కాజల్ ని మాత్రం తేజ మెచ్చుకొన్నాడు. ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా తన ఆఫీసుకు వచ్చి వెళ్లిపోయే ఒకే ఒక్క స్టార్ కాజల్ అనీ, ఆమెకి కృతజ్ఞత ఉందని ఆకాశానికెత్తేశాడు తేజ. అయితే తేజ ఇలాగే హీరోల్ని విమర్శిస్తే అందుకు ధీటుగా జవాబు చెప్పాలని ఆయా హీరోల అభిమానులు డిసైడైనట్టు తెలుస్తోంది. పనిగట్టుకొని హీరోల్ని విమర్శించడం తగదని పరిశ్రమ వర్గాలు కూడా చెబుతున్నాయి. తేజవల్ల చాలామందికి లైఫ్ వచ్చుండొచ్చని, అంతమాత్రాన ఎప్పుడూ కృతజ్ఞత చూపిస్తూనే ఉండాలని కోరుకోవడం మాత్రం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు.