చాలా రోజుల తర్వాత `నేనే రాజు నేనే మంత్రి`తో ఫామ్లోకి వచ్చాడు తేజ. ఆ చిత్రం హిట్టయిందో లేదో ఆ వెంటనే ఆయన్ని వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. అగ్ర కథానాయకులు మళ్లీ ఆయనతో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తదుపరి వెంకటేష్ కథానాయకుడిగా `ఆట నాదే వేట నాదే` అనే సినిమాని తేజ తెరకెక్కించబోతున్నారని ప్రచారం సాగింది. ఆ చిత్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహించే అవకాశం ఆయన్ని వరించింది. ఇక `ఎన్టీఆర్` తర్వాతే వెంకటేష్ తో సినిమా చేస్తారేమో అనుకొన్నారంతా. కానీ ఇంతలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
`ఎన్టీఆర్` చిత్రీకరణ ఆరంభమయ్యాక ఆయన అర్ధంతరంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో తేజ ఇక మళ్లీ వెనక్కివచ్చి వెంకటేష్ సినిమాని మొదలుపెడతారేమో అనుకొన్నారంతా. నిజానికి ఆ సినిమా కోసం రెండు రోజులు ఆడిషన్స్ కూడా చేశారట. ఆడిషన్స్ కి ఎక్కువమంది రావడంతో ఆయన అర్ధంతరంగా వాటిని ఆపేసినట్టు వార్తలొచ్చాయి. మరేమైందో ఏంటో కానీ.. ఎవరూ ఊహించని రీతిలో ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా సినిమాని పట్టాలెక్కించాడు తేజ. మరింతకీ వెంకీతో అనుకున్న `ఆట నాదే వేట నాదే` సినిమా ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. ఏదేమైనా `నేనే రాజు నేనే మంత్రి` తర్వాత ఏ సినిమా చేయాలనేది తేల్చుకోలేక తేజ కొంచెం గందరగోళానికి గురయ్యారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. తేజ మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి మరొక విజయం అందుకోవమే లక్ష్యం అన్నట్టుగా కొత్త సినిమాకోసం రంగంలోకి దిగాడు.