సీనియర్ దర్శకుడు తేజ తన కెరీర్ ఆరంభం నుంచి చాలా వరకు కొత్త.. వర్ధమాన హీరోలతోనే సినిమాలు చేశాడు. ఐతే కెరీర్లో ఒక్కసారి మాత్రం మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ‘నిజం’ సినిమా చేశాడు. ఆ సినిమా ఆడకపోయినా.. అందులో మహేష్ ను తేజ ప్రెజెంట్ చేసిన తీరు విమర్శకుల ప్రశంసలుకుంది. మహేష్ చేసిన సీతారం పాత్ర జనాలకు అలాగే గుర్తుండిపోయింది. ఆ పాత్ర పేరే చాలా కొత్తగా అనిపించింది జనాలకు. ఆ సినిమా మంచి ఫలితాన్నివ్వకపోయినా.. మళ్లీ ఆ పాత్ర పేరును మరోసారి తన సినిమాలో ఉపయోగించబోతున్నాడట తేజ. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో పేరు సీతారమేనట. ఈ విషయంలో తేజ గత సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ స్ఫూర్తి కూడా ఉందట.
‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరో పాత్ర పేరు జోగేంద్ర. ఐతే తన భార్య రాధ మీద ప్రేమతో అతను ఆమె పేరును కూడా తన పేరుకు జోడించి రాధా జోగేంద్రగా పిలిపించుకుంటాడు. అదే తరహాలో తన కొత్త సినిమాలోనూ హీరోకు హీరోయిన్ పేరు కలిసొచ్చేలా పెట్టాడట. వాస్తవానికి హీరో పేరు రామ్ అయితే.. హీరోయిన్ కాజల్ పేరైన ‘సీత’ను కూడా అతను కలుపుకుంటాడట. ఈ చిత్రంలోనూ కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని.. ఇది కాజల్ కెరీర్లో మరో ప్రత్యేకమైన క్యారెక్టర్ అవుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు హీరోయిజం ఉన్న మాస్ మసాలా సినిమాలే చేస్తూ వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్.. తొలిసారి సామాన్యమైన పాత్రలో కనిపించనున్నాడట. కథలో ఒక పాత్రధారిలా తప్ప హీరోలా అతను కనిపించడట. ఈ సినిమా కోసం అతను లుక్ కూడా మార్చుకన్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలన్న సంకల్పంతో తేజ ఉన్నాడు.