కొన్ని సినిమాల్లో పాయింట్ బాగానే ఉంటుంది. కాని కంటెంట్ విషయానికొస్తేనే అత్యంత దారుణంగా ఉంటుంది. దానికితోడు పేలవమైన స్ర్కీన్ ప్లే - అనవసరమైన పాటలు - పనికిరాని సీన్ లు - నవ్వురాని కామెడీతో సినిమా మొత్తం జుగుప్సాకరంగా తయారవుతుంది. సరిగ్గా అలాంటి సినిమానే కదూ నువ్వు తీసింది తేజా బాబూ అంటే, అసలు మీరు పాయింట్ చూడకుండా సోది చెబుతున్నారు అంటున్నాడు గురుడు.
''హోరా హోరీ'' సినిమాతో మరోసారి జయం సినిమానే తీశాడనే కామెంట్ నే ఎదుర్కొంటున్నాడు తేజ. అయితే అందుకు మనోడు ఒప్పుకోవట్లేదు. సినిమాలో పాయింట్ ఉంది, పాయింట్ ఉంది అంటున్నాడు. ఏమా పాయింట్ అంటే.. సినిమాలో నిజానికి చదువు చెప్పిన గురువే చివరకు తన శిష్యుడితో తలపడాల్సి రావడం.. అంటే మహాభారతంలో అర్జునుడితో యుద్దం చేసిన ద్రోణాచార్యుడిలా అనమాట... అదంతా కొత్త పాయింట్ కదా అంటున్నాడు తేజ. కాకపోతే ఇక్కడ హీరో అర్జునుడిలా, ఆ విలన్ ఒక ద్రోణాచార్యుడిలా కనిపించలేదు మాష్టారూ. సిల్లీగా చూపించడం వలన ఆ రేంజులో ఏమీ ఎస్టాబ్లిష్ కాలేదు. ఫార్ములా మహాభారతంలోదేనైనా, సీన్ లు నవభారతంలా ఉండాలి కదండీ??
సార్ ఇదే పాయింట్ తో తమిళంలో వెట్రిమారన్ అనే దర్శకుడు ఆడుకలాం అనే సినమాను తీశాడు. కాని ఈ హోరా హోరీకి ఆ సినిమాకు చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉంది ఇక్కడ కంటెంట్ లేదు. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదు.. ఎప్పుడూ ఫారెస్టు బ్యాక్ డ్రాపే తీసుకుంటే మరి జనాలు జయం సినిమా అనక దానికి నవరసభరితమైన క్లాసిక్ అంటారేంటండీ బాబూ!!