ఈ యంగ్ ‌హీరో మెగా కాంపౌండ్ లో 12వ ఆట‌గాడు?

Update: 2021-03-28 02:30 GMT
మెగా కాంపౌండ్ ఇప్ప‌టికే ఒక క్రికెట్ టీమ్ కి స‌రిపడినంత‌ మంది హీరోలతో క‌ళ‌క‌ళ‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంఖ్య మునుముందు ఇంకా పెర‌గ‌నుందా? అంటూ నిరంత‌ర సోష‌ల్ మీడియా డిబేట్ తెలిసిన వ్య‌వ‌హారమే.

అయితే కుటుంబ హీరోల‌తో పాటు త‌మ‌ను అభిమానించే ప్రేమించే ఇత‌ర హీరోల‌కు కూడా త‌మ‌వంతుగా లిఫ్టివ్వ‌డం చూస్తున్న‌దే. ప్ర‌తిభావంతుల‌కు త‌మ వారైన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వార‌సుల‌కు కూడా ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేందుకు ఏదో ఒక ర‌కంగా సాయం చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల కొణిదెల ఇంటి పేరుతో హీరో అవుతున్న ఒక కుర్రాడికి కూడా మెగా కాంపౌండ్ అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేస్తోంది. ఇత‌ర హీరోల ప్ర‌చార సాయం కోరినా మెగాస్టార్ సాయ‌ప‌డుతున్నారు.

ఇక మెగా కాంపౌండ్ లో ఓ యంగ్ హీరోకి ఆద‌ర‌ణ ద‌క్క‌డంపై ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అత‌డే తేజ స‌జ్జా. ఓబేబి చిత్రంలో స్టార్ హీరోయిన్ స‌మంత‌తో పాటు న‌టించిన ఈ కుర్రాడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇప్పుడిప్పుడే పరిశ్ర‌మ‌లో బుడి బుడి అడుగులు వేస్తున్న  ఈ యువ‌హీరో కి పెద్ద కెరీర్ ఉంటుంద‌ని మెగా హీరోలు ప్రోత్స‌హిస్తున్నారు. అత‌డికి మెగాస్టార్ చిరంజీవి స‌హా చ‌ర‌ణ్ ఆశీస్సులు ఎల్ల‌వేళ‌లా ఉన్నాయి.

ఆ అభిమానాన్ని తేజ స‌జ్జా అస్స‌లు దాచుకోవ‌డం లేదు. నిన్న‌(మార్చి 26) సాయంత్రం చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొన్న తేజ స‌జ్జా.. వేదిక‌పైనే ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. తేజ స‌జ్జా మాట్లాడుతూ .. నా బర్త్ డేకి చిరంజీవి గారిని కలవడం.. ఆ రోజు అయన తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ తెచ్చి బర్త్ డే వేడుకలు జరపడం నేనెప్పటికీ మరచిపోలేను. ఆ తరువాత చరణ్ అన్న నన్ను తీసుకుని వెళ్లి నాకు బట్టలు కూడా కొనిచ్చారు .. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు.. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నిజంగా చరణ్ అన్న గ్రేట్. న‌న్ను ఆ ఫ్యామిలీ లో ఒక్కడిగా చూసినందుకు చాలా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు. మెగా బ్లెస్సింగ్స్ తోనే శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్.. మాస్ మ‌హారాజా ర‌వితేజ పెద్ద హీరోల‌య్యారు. తేజ స‌జ్జా కూడా మెగాశీస్సుల‌తో అంత పెద్ద హీరో అవ్వాల‌ని ఆకాంక్షిద్దాం.

తేజ స‌జ్జా బాల‌న‌టుడిగా 50 పైగా సినిమాల్లో న‌టించాడు. హీరో అయ్యాక వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ఈవెంట్లో తేజ స‌జ్జా ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్ తో పాటు హైలైట్ అయిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News