ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా 21రోజుల లాక్ డౌన్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు నటుడు చిరంజీవి సెల్యూట్ చేసారు. చిరంజీవి పోస్ట్‌కు తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి కరోనాను కట్టడి చేసే పోరాటంలో పాలుపంచుకుంటున్న పోలీసులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబందించి ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక పోలీసు బిడ్డగా పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో నాకు తెలుసన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేసారు. చిరంజీవి పోస్ట్‌కు తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
డీజీపీ మాట్లాడుతూ.. 'మీ లాంటి వాళ్లు నాకు మాత్రమే కాదు. మా పోలీస్ ఫోర్స్ కు మీ మాటలు ఎంతో స్పూర్తినిస్తున్నాయి. మీ లాంటి హీరోల పిలుపు వల్ల చాలా మంది కరోనా పై పోరాటంలో ప్రజలు కలిసి వస్తారని పేర్కొన్నారు. ఒక పోలీసు ఫ్యామిలీ మెంబర్ గా మీకు పోలీసులు బాధ్యతలు ఎలా ఉంటాయో తెలిపినందుకు కృతజ్ఞతలు అన్నారు. మీ మాటలు మీ అభిమానులతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి లాక్ డౌన్ అమలులో పోలీసులకు అందరు సహకరిస్తానని కోరుతున్నట్లు తెలిపారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసాడు చిరంజీవి. ఈ ఛారిటీకి బాలకృష్ణ సహా ప్రతి ఒక్క హీరో తన వంతుగా ఆర్ధిక సాయం అందించారు. చిరంజీవి కూడా తన వంతుగా రూ.కోటి రూపాయల విరాళం ఇచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.