మహమ్మారి.. దాన్నుంచి విధించిన నిర్బంధం కారణంగా సినీ పరిశ్రమ మొత్తం మూతపడింది. థియేటర్లు మొదలు షూటింగ్ ల వరకు నిలిచిపోయాయి. భవిష్యత్తులో ఓపెన్ కావడం కూడా ప్రశ్నార్థకంగా మారాయి. 60 రోజులుగా నటులు -సినీ కార్మికులు - కళాకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు.
అయితే తాజాగా లాక్ డౌన్ 4.0లో చాలా వాటికి సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం సినిమా రంగానికి మాత్రం ఆ చాన్స్ ఇవ్వలేదు. దీంతో దాదాపు అన్ని కార్యాలయాలు తెరుచుకున్నా.. సినిమా రంగానికి చెందిన కార్యకలాపాలు మాత్రం తెరవలేదు. ప్రైవేట్ ఆఫీసులు కూడా పనిచేస్తున్నా సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రం సర్కార్ ఓకే చెప్పలేదు.
దీనిపై సినీ రంగం నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు చిరంజీవి ఆధ్వర్యంలో సినిమా పెద్దలు సమావేశమయ్యారు. సినిమా రంగానికి ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. సినిమాల షూటింగ్ లు.. సమస్యలు, సినిమా థియేటర్లకు అనుమతులు వాటిపై చర్చించారు. ఇండస్ట్రీ సమస్యల గురించి సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని తలసాని పేర్కొన్నారు.
ఇక కీలకమైన ఈ సమావేశంలో సినిమాల పోస్ట్ ప్రొడక్షన్స్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని.. వాటికి అనుమతి ఇస్తున్నట్టుగా తలసాని ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీకి భారీ ఊరట దక్కింది. నిర్మాణం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురుచూస్తున్న సినిమాలు.. ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు కూడా ఇక చకచకా పనులు చేసుకోబోతున్నాయి.