తెలుగు ప్రేక్షకుడా.. ఏంటీ షాకులు?

Update: 2015-12-15 17:30 GMT
లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ హీరోగా ‘రభస’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రొటీన్ అనిపించుకున్నప్పటికీ అందులో కామెడీ బాగానే ఉంటుంది. సినిమా మరీ తీసిపడేయదగ్గదేమీ కాదు. కానీ ఎన్నాళ్లు ఇలాంటి రొటీన్ సినిమా చూస్తామంటూ తిప్పికొట్టారు ప్రేక్షకులు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది‘రభస’. తర్వాత కొన్ని నెలలకు ‘లౌక్యం’సినిమా వచ్చింది. అది కూడా రొటీన్ సినిమానే. దాదాపుగా రభస ఫార్మాట్ లోనే సాగుతుంది. అందులో కూడా కామెడీ బాగా పండింది. రొటీన్ అంటూనే సినిమాను పెద్ద హిట్ చేశారు జనాలు.

ఇక ఈ ఏడాది చూస్తే దసరాకు భారీఅంచనాల మధ్య విడుదలైంది ‘బ్రూస్ లీ’.సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. ఒకసారి చూడొచ్చు అన్నారు జనాలు. కామెడీ కొంతవరకు వర్కవుటైంది. కానీ సినిమా నిలబడలేదు. చాలా త్వరగా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. చిరు క్యామియో రోల్ కూడా సినిమాను నిలబెట్టలేదు. ఐతే ఇప్పుడు‘బెంగాల్ టైగర్’ వచ్చింది. ఇది మరీ రొటీన్ సినిమా అన్నారు. కామెడీ వర్కవుటైంది. కలెక్షన్లు అదిరిపోతున్నాయి. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద రేంజికి వెళ్తోంది. ఐతే రొటీన్ గా ఉందంటూ కొన్నిసార్లు తిప్పి కొడుతున్న తెలుగు ప్రేక్షకుడే.. కొన్నిసార్లు రొటీన్ సినిమానే నెత్తిన పెట్టుకుంటున్నాడు.

ఇంతకీ ప్రేక్షకుడు ఎప్పుడు మన్నిస్తాడు, ఎప్పుడు తిరస్కరిస్తాడు అనే విషయమే దర్శకులు - రచయితలకు అర్థం కావడం లేదు. ఐతే ఈ విషయంలో సున్నితమైన ఓ రేఖ ఉంది. ఆ రేఖను పట్టుకునే దర్శకులు - రచయితలు విజయవంతమవుతున్నారు. మిగతా వాళ్లు విఫలమవుతున్నారు. కోన వెంకట్‌ కు ఈ రేఖ గురించి బాగా తెలుసని అనుకునేవారు కానీ.. ఇప్పుడు అతను కూడా బ్రూస్ లీ - శంకరాభరణం సినిమాలతో బోల్తా కొట్టాడు. మొత్తానికి ప్రేక్షకుడి నాడి పట్టడం మాత్రం ఎవ్వరికీ సాధ్యమయ్యేలా లేదు.
Tags:    

Similar News