తెలుగు సినిమా ఎన్నో స్వర్ణ యుగాలను చూసింది. మరెన్నో క్లాసిక్స్ వచ్చాయి. మాల పిల్ల నుంచి మొదలుపెడితే శంకరాభరణం దాకా ఎన్నో కళా ఖండాలను చెప్పుకోవచ్చు. ఇక కమర్షియల్ గా కూడా తెలుగు సినిమా ఏనాడో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి కూర్చుంది. తెలుగు సినిమా అంటేనే ఒక గ్లామర్. అందుకే బాలీవుడ్ కూడా ఇటు వైపు తొంగి చూస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే టాలీవుడ్ గత కొన్నేళ్ళుగా సంక్షోభాలను ఎదుర్కొంటోంది. పెద్ద సినిమాలు హిట్ అయితే సినిమా బాగు పడినట్లు కాదు, చిన్న సినిమా బాగుంటేనే బొమ్మ కళకళలాడేది. అయితే ఈ విషయంలో అంతా మేడి పండు చందంగా కధ ఉంది.
ఇదిలా ఉంటే తెలుగు సినిమాకు నిజంగా అవసరాలు ఉన్నాయి. కష్టాలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి. కానీ అవన్నీ ఎవరివీ అన్న ప్రశ్న ఇక్కడ వస్తోంది. చిన్న సినిమాలు ఇపుడు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉందా. మల్టీప్లెక్స్ లో ఆడేవి ఎవరి సినిమాలు, సింగిల్ థియేటర్ల వ్యవస్థ క్రమంగా కనుమరుగు అవుతున్న నేపధ్యంలో చిన్న సినిమాను కళ్ళకు అద్దుకుని తమ థియేటర్లలో ఆడించే వారు ఎంత మంది ఉన్నారు. మరో వైపు టికెట్ల ధరలు బాగా పెంచేయమంటున్నారు. మరి పెరిగిన ధరలతో పెద్ద సినిమాలకు లాభం కలిగితే అదే నిష్పత్తిలో చిన్న సినిమా నష్టపోవడం ఖాయం.
ఇక చిన్న సినిమాల తరఫున ఒకనాడు దాసరి నారాయణరావు లాంటి దిగ్గజాలు మాట్లాడేవారు. వారి కష్టాలను ప్రభుత్వాల వద్ద ఏకరువు పెట్టి ఎంతో కొంత ఊరటను ఇచ్చే ప్రయత్నం చేసేవారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు. మరో వైపు తమకు బాధలు ఉన్నాయని ఏడుస్తున్న వారంతా నిజంగా సమస్యలలో ఉన్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలుగు సినిమా ఏడాదికి వందకు పైగా సినిమాలు తీస్తే అందులో పాతిక దాకా పెద్ద సినిమాలు మినహాయిస్తే మిగిలినవి అన్నీ కూడా చిన్న సినిమాలే. మరి వాటి గురించి గొంతెత్తి మాట్లాడినపుడే పరిశ్రమ వెలుగుతుంది. పూర్వ వైభవం వస్తుంది. ఆన్ లైన్ టికెటింగ్ మీద పెద్ద మాటలు మాట్లాడుతున్న వారు, విమర్శలు చేస్తున్న వారంతా చిన్న సినిమా గురించి అసలు ఆలోచించడంలేదు అంటున్నారు. మరో వైపు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమకు కావాల్సింది ఏంటో కూడా క్లారిటీతో ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఒక పెద్ద సినిమా కంటే చిన్న సినిమా హిట్ అయితే ఎక్కువ మంది బాగుంటారు. ఎక్కువ మందికి ఉపాధి దక్కుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆదుకోవాలన్న డిమాండ్ అయితే ఉంది మరి.